దేశం లో ఆర్థిక మాంద్యం ఏ రంగాన్ని వదలటం లేదు. తాజాగా ఇది ఇండియన్ రైల్వేస్ పైన పంజా విసిరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆదాయాలను పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే తెసిలిపోతోంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్ (ఆర్ టీ ఐ ) ద్వారా సంపాదించిన వివరాల ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో భారత రైల్వేల సరుకు రవాణా ఆదాయం ఏకంగా రూ 3,901 కోట్లు తగ్గిపోగా, పాసెంజర్ చార్జీల ఆదాయం కూడా రూ 155 కోట్ల మేరకు క్షీణించింది.
దీన్ని బట్టి చూస్తే భారత్ లో అన్ని రంగాల్లోనూ ఆర్థిక మాంద్యం నెలకొందని స్పష్టమవుతోంది. ఆర్థిక మాంద్యమా అదెక్కడా అని ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులకు ఇది తప్పనిసరిగా కనువిప్పు కలిగించనుంది. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనంలో వెల్లడించింది.

వివరాలు కోరిన మధ్య ప్రదేశ్ వాసి ...
మధ్య ప్రదేశ్ లోని నీముచ్ కు చెందిన సంఘ సంస్కర్త చంద్ర శేఖర్ గౌర్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేస్ ను ఈ మేరకు వివరాలు కోరారు. ఇందుకోసం ఆర్ టీ ఐ మార్గాన్ని ఎంచుకొన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రైల్వేస్ రూ 29,067 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని ఆర్జించింది. కానీ అది కాస్తా రెండో త్రైమాసికానికి వచ్చేప్పటికి రూ 25,165 కోట్ల కు తగ్గి పోయింది. అదే సమయంలో పాసెంజర్ ఆదాయాలు కూడా ప్రభావితం అయ్యాయి. తోలి క్వార్టర్ లో రూ 13,398 కోట్ల ఆదాయాన్ని పొందితే... టెండో క్వార్టర్ కు అది రూ 13,243 కోట్లకు పడి పోయింది. సబర్బన్ రైల్ ప్రయాణాల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

మొదలైన దిద్దు బాటు చర్యలు...
ఆర్థిక మాంద్యం అలుముకొంటున్న సమయంలో భారతీయ రైల్వే దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సరుకు రవాణా పై బిజీ సీజన్లో విధించే సర్చార్జీలను తొలగించింది. ఏసి చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ప్రయాణాల టికెట్ ధర లో 25% తగ్గింపును అందిస్తోంది. ఇంధన వ్యయాలను కుదించేందుకు 30 ఏళ్ళు పైబడిన డీజిల్ ఇంజిన్ల ను తొలగించాలని నిర్ణయించింది. అదే సమయంలో చార్జీయేతర ఆదాయాలను పెంచుకోవాలని నిర్ణయం తీసుకోంది.

భూముల విక్రయం...
ఆర్థిక మాంద్యం ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఇండియన్ రైల్వేస్ ... భూములను కూడా విక్రయించే యోచనలో ఉంది. తద్వారా అధిక ఆదాయాలు సమకూరుతాయని భావిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక మాంద్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని దేశంలోని 17 జోన్ లకు ఇండియన్ రైల్వేస్ సూచించింది. ఈ మేరకు ఒక లేఖ కూడా రాసినట్లు సమాచారం. దేశంలో బొగ్గు, స్టీల్, సిమెంట్ వంటి ప్రధాన రంగాల్లో నెలకొన్న మందగమనం రైల్వేస్ ఆదాయాలపై ప్రభావం చూపుతోందని, అయితే, తాము దీనిని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని ఇండియన్ రైల్వేస్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు పీటీఐ పేర్కొంది.

ముదిరే అవకాశం...
ఇప్పుడిప్పుడే మొదలైన ఆర్థిక మాంద్యం ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశంలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను అంచనా వేసి తగు చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. మొండి వైఖరి ప్రదర్శిస్తే ఒక రంగం నుంచి మరో రంగానికి మాంద్యం ప్రభావం విస్తరించి దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి ఏటా లాభాలు గడించే ఇండియన్ రైల్వేస్ ఇలా ఆదాయాల్లోనే క్షీణతను నమోదు చేస్తుండటం ఆందోళనకరమని అంటున్నారు. ఇప్పటికైనా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని ఉద్దీపన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications