న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్ సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) కింద టెలికం సంస్థల నుంచి రూ.92,000 కోట్ల రికవరీకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, దానిని అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. టెలికం విభాగం రూపొందించిన ఏజీఆర్ నిర్వచనాన్ని సుప్రీం బెంచ్ సమర్థించింది. టెలికం విభాగ అభ్యర్థనను అనుమతిస్తున్నామని, టెలికం సంస్థల సమర్ఫణలను తోసిపుచ్చుతున్నామని న్యాయస్థానం తెలిపింది. టెలికం సంస్థలు వడ్డీ, జరిమానా కలిపి టెలికం విభాగానికి చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో పిటిషన్లు అంగీకరించమని, టెలికం కంపెనీలు ఎంత చెల్లించాల్సి ఉంటుందో లెక్కించేందుకు చెల్లింపు గడువును తర్వాత ప్రకటిస్తామన్నారు.

వివిధ సంస్థలు రూ.92,000 కోట్లు
ఏజీఆర్ కింద భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్‌ఎల్ నుంచి దాదాపు రూ.92,000 కోట్లను వసూలు చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు తెలిపింది. టెలికం శాఖ ఏజీఆర్ నిర్వచనంపై జస్టిస్ ఎస్‌ఏ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన స్పందిస్తూ... 'టెలికం శాఖ సూచించిన ఏజీఆర్ నిర్వచనాన్ని అంగీకరిస్తున్నాం. టెలికం ఆపరేటర్ల వాదనను ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఇక తదుపరి విచారణల్లేవు. లైసెన్స్ ఫీజుల్ని చెల్లించాలి. వడ్డీతో సహా జరిమానాలను కట్టాలి' అని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

కొత్త టెలికం విధానం ప్రకారం...
కొత్త టెలికం విధానం ప్రకారం ఏజీఆర్‌లో (సవరించిన స్థూల ఆదాయం) వాటాను వార్షిక లైసెన్స్ రుసుం కింద టెలికం ఆపరేటర్లు.. కేంద్రానికి ఇవ్వాలి. దీనికి అదనంగా మొబైల్ నెట్ వర్క్ సంస్థలు స్పెక్ట్రం వినియోగ చార్జీల్ని చెల్లించాలి. టెలికం ఆపరేటర్లు రూ.92 వేల కోట్లకు పైగా లైసెన్స్ ఫీజు బకాయి పడ్డారని ఈ ఏడాది జూలైలో సుప్రీంకు టెలికం శాఖ తెలిపింది. అంతకుముందే ఈ వ్యవహారంపై టెల్కోలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై టెలికం శాఖ వివరణ ఇచ్చింది. పై సంస్థలు అన్నీ రూ.92వేల కోట్లు చెల్లించాల్సి ఉందని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది.

మొత్తం ఇలా..
కేంద్రం లెక్క ప్రకారం ఎయిర్ టెల్ రూ.21,682.72 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.19,823.71 కోట్లు, ఆర్.కామ్ రూ.16,456.47 కోట్లు, బీఎస్ఎన్ఎల్, రూ.2,098.72 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.2,537.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటికి వడ్డీ, జరిమానాలు అదనం. ఇవన్నీ కలిపి రూ.92 వేల కోట్లకు పైగా ఉన్నాయి.

ఏం జరిగిందంటే?
టెలికమేతర ఆదాయమైన అద్దె, స్థిరాస్తుల విక్రయంపై వచ్చే లాభం, డివిడెండ్, వడ్డీ, ట్రెజరీ ఆధాయాలను కూడా ఏజీఆర్ కింద పరిగణిస్తామని దీని పైన కూడా లైసెన్స్ రుసుము ప్రభుత్వానికి చెల్లించాలని టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. కానీ పెట్టుబడులు, వసూలు కాని రుణాలు, డీలర్లకు పంపిణీ మార్జిన్లు, విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు, తుక్కు అమ్మకం, ఆలస్య రుసుము వంటి వాటిని ఏజీఆర్ కింద పరిగణించలేదు. దీంతో అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ టెల్కోలు సుప్రీంను ఆశ్రయించాయి. సుప్రీం తీర్పు వాటికి వ్యతిరేకంగా వచ్చింది. ఏజీఆర్ నిర్వచనంపై వివాదం 2005 నుంచి నడుస్తోంది.

సంస్థకు ఆర్థిక కష్టాలు..
సుప్రీం తీర్పుపై వివిధ టెల్కోలు స్పందించాయి. ఈ తీర్పు తమను నిరుత్సాహానికి గురి చేసిందని, పరిశ్రమకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని సెల్యూలార్ ఆఫరేటర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అన్నారు. ఇప్పటికే పరిశ్రమకు రూ.4 లక్షల కోట్ల రుణభారం ఉందని, ఇది కూడా జత కలిస్తే ఆర్థిక భారం వల్ల డిజిటల్ భారత్ లక్ష్యం ఆలస్యమవుతుందన్నారు. 119 కోట్ల కనెక్షన్లతో దేశ ఆర్థిక వ్యవస్థకు టెలికం విభాగం కీలకంగా మారిందని, ఉద్యోగాలు కల్పిస్తూ, సంపదను సృష్టిస్తోందని, జీడీపీలో 6.5 శాతం వాటా ఉందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడితో ప్రపంచస్థాయి మొబైల్ నెట్ వర్క్స్ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతి తక్కువ ఛార్జీలతో సేవలు అందిస్తూ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ తీర్పు మరింత గుదిబండ అని అభిప్రాయపడ్డారు.

ఐడియా, ఎయిర్ టెల్ ఏం చెప్పాయంటే
టెలికం రంగ మనుగడను ఈ తీర్పు బలహీనపరుస్తోందని భారతీ ఎయిర్‌టెల్ ఆందోళన వ్యక్తం చేసింది. తీర్పు ప్రభావం 15 పాత సంస్థలపై ఉంటుందని, ఇందులో 2 సంస్థలే ఇప్పుడు సేవలు అందిస్తున్నాయని, ఇప్పటికే పరిశ్రమ ఒత్తిడిలో ఉందని, ఇది మరింత ఇబ్బందికరమన్నారు. టెలికం ఆదాయ నిర్వచనంపై 14 ఏళ్లుగా ఉన్న వివాదంలో ప్రస్తుత తీర్పు వల్ల టెల్కోలకు భారీ ఇబ్బందులు అని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ తీర్పుపై న్యాయ సలహాదార్లతో చర్చించి, రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications