మీరు జాగ్రత్త.. మోడీ టీవీ చూస్తున్నారు: 'మోడీ వ్యతిరేకి'పై అభిజిత్ బెనర్జీ

న్యూఢిల్లీ: పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కాపాడుతుందని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. గ్రామాల్లో వైద్యం అందిస్తున్న అత్యధికులకు తగిన అర్హతలు లేవని, అలాంటి వారిని గుర్తించి, శిక్షణ ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. రోగి లక్షణాలను సెల్ ఫోన్ యాప్‌లో పొందుపరిచి, ఎలాంటి వైద్యం చేయాలనుకున్నది వీరు చెబితే, అది మంచిదా కాదా అని నిపుణుల అభిప్రాయం వెల్లడించేలా ఆధునిక వ్యవస్థ ఉండాలని చెప్పారు. మోడీతో భేటీ అద్భుతంగా జరిగిందని అభిజిత్ చెప్పగా, అభిజిత్‌తో భేటీ అద్భుతం అని మోడీ ట్వీట్ చేశారు.

మోడీ ఆలోచనలు వినూత్నం

మోడీ ఆలోచనలు వినూత్నం

మోడీతో భేటీ అయి బయటకు వచ్చాక అభిజిత్ మీడియాతో మాట్లాడుతూ... 'ఎన్డీయే పరిపాలనపై క్షేత్రస్థాయిలో కొందరిలో నెలకొన్న అపోహల్ని తొలగించాలంటే పరిపాలనకు సంబంధించి ప్రజల సలహాలు కూడా స్వీకరించాలని, అధికార వ్యవస్థని ప్రక్షాళన చేసి ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంచాలని మోడీ చెప్పారని, భారత్ అభివృద్ధి కోసం మోడీ ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయని ప్రశంసించారు.

మోడీని కలవగానే జోకులు వేశారు..

మోడీని కలవగానే జోకులు వేశారు..

ప్రధాని మోడీని తాను కలవగానే ఆయన జోకులు వేశారని అభిజిత్ బెనర్జీ అన్నారు. ముఖ్యంగా మీడియా గురించి ఛలోక్తులు విసిరారన్నారు. మోడీకి వ్యతిరేకంగా మీరేమైనా చెబుతారేమోనని బయట మీడియా కాచుకొని కూర్చుందని, మీ నుంచి అలాంటి వ్యాఖ్యలు రాబట్టాలని ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తనతో నవ్వుతూ చెప్పారన్నారు. మీడియా మిమ్మల్ని మోడీ వ్యతిరేక ప్రచారంలోకి లాగే ప్రయత్నం చేస్తోందా.. అందులో ఇరుక్కోకండి అని మోడీ తనతో చెప్పారని అభిజిత్ అన్నారు.

మీరు జాగ్రత్త..

మీరు జాగ్రత్త..

మోడీ టీవీల ద్వారా అన్నింటిని చూస్తూ ఉంటారని, మీడియా ప్రతినిధులు ఏం చేస్తారో గమనిస్తూ ఉంటారని, మీడియా ఏం చేస్తుందో ఆయనకు బాగా తెలుసునని, మీరు (విలేకరులు) జాగ్రత్త అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అభిజిత్ బెనర్జీ అన్నారు.

భారత్ గర్విస్తోంది...

అభిజిత్ బెనర్జీతో మంగళవారం ఆహ్లాదకరమైన వాతావరణంలో భేటీ జరిగిందని, వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయని మోడీ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో సమావేశం అద్భుతం అని, మానవ సాధికారతపై ఆయనకు ఉన్న తపన స్పష్టంగా కనిపిస్తోందని, వివిధ అంశాలపై ఆలోచనలను పంచుకున్నామని, ఆయన సాధించిన విజయాలు చూసి భారత్ గర్విస్తోందన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+