For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1,700 తగ్గిన బంగారం ధర: హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో...

|

న్యూఢిల్లీ: బంగారం ధరలు తగ్గుతున్నాయి. బుధవారం (సెప్టెంబర్ 11) ఢిల్లీలో 99.9 శాతం స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.372 తగ్గి రూ.38,975గా ఉంది. పండుగ సీజన్ ఇంకా ప్రారంభం కాకపోవడమే ధరలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది. నాణేల తయారీదారులు, ఆభరణాల వర్తకుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర రూ.1,150 తగ్గి రూ.48,950గా ఉంది.

భారత్‌లో ఐఫోన్ ధరలు.. ఏ వేరియంట్ ఎంత అంటే?భారత్‌లో ఐఫోన్ ధరలు.. ఏ వేరియంట్ ఎంత అంటే?

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం

అంతర్జాతీయ మార్కెట్లలోను బంగారం ధర ఔన్సుకు 1,500 డాలర్ల కిందకు పతనమైంది. అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం వరకు బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. ఓ దశలో ఔన్స్ ధర 1550 డాలర్లు దాటింది. ప్రస్తుతం 1500 డాలర్లకు అటు ఇటుగా ఉంది. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 0.16 శాతం పెరిగి 1501.60 డాలర్లుగా ఉంది.

హైదరాబాద్‌లో ధర

హైదరాబాద్‌లో ధర

బంగారం ధరలు బుధవారం ఆయా నగరాల్లో ఇలా ఉన్నాయి... వరుసగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు... చెన్నైలో రూ.36,340, రూ.39,660, ముంబైలో రూ.37,300, రూ.38,300, న్యూఢిల్లీ రూ.37,100, రూ.38,300, కోల్‌కతాలో రూ.37,580, రూ.38,770, బెంగళూరు రూ.35,650, రూ.38,940, హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం రూ.36,340, 24క్యారెట్ల బంగారం రూ.39,660గా ఉంది.

విజయవాడలో బంగారం ధర...

విజయవాడలో బంగారం ధర...

బంగార ధరలు 22 క్యారెట్లు, 24 క్యారెట్లు వరుసగా మ‌దురై రూ.36,340, రూ. 39,660, విజ‌య‌వాడ‌ రూ.36,340, రూ.39,660, పాట్నాలో రూ. 37,300, రూ. 38,300, నాగ్‌పూర్‌ రూ.37,300, రూ.38,300, సూర‌త్ రూ.37,440, రూ.38,240, విశాఖప‌ట్నం, వైజాగ్ రూ.36,340, రూ.39,660గా ఉంది.

వారంలో రూ.1730 తగ్గుదల

వారంలో రూ.1730 తగ్గుదల

బంగారం ధర బుధవారం భారీగానే తగ్గింది. ఎంసీఎక్స్‌లో 0.26 శాతం తగ్గి రూ.38,154గా ఉంది. గత వారం రూ.39,885గా ఉన్న ధర రూ.1730 తగ్గింది. ఎంసీఎక్స్‌లో వెండి ధర 0.23 శాతం తగ్గి రూ.47,686గా ఉంది. కిలోకు రూ.51,489 ఉండగా రూ.3,800 తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో బంంగారం ధర పది గ్రాములకు రూ.372 తగ్గింది

English summary

రూ.1,700 తగ్గిన బంగారం ధర: హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో... | Gold prices today down ₹1,700 from highs, silver rates fall further

Gold prices in India continue to slide after hitting new highs last week. Silver prices have also fallen sharply.
Story first published: Thursday, September 12, 2019, 8:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X