ఉద్యోగుల్లేక ఈ కంపెనీ $100 మిలియన్ల ఆదాయం డమాల్, 10,000 ఉద్యోగాలు రెడీ

బెంగళూరు: అమెరికాకు చెందిన DXC టెక్నాలజీ భారతదేశంలో 10,000 మంది ఉద్యోగులను తీసుకోనేందుకు ప్లాన్ చేస్తోంది. డిజిటల్ టెక్నాలజీలో బాగా నైపుణ్యం కలిగిన వారిని తీసుకోవాలని భావిస్తోంది. అంటే డిజిటల్ టెక్నాలజీపై మంచి పట్టున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కంపెనీలో మార్పులు చేసి ప్రస్తుత పోటీని తట్టుకునేట్లు చేసేందుకు ఈ వ్యూహానికి పదును పెడుతోంది.

డిజిటల్ స్కిల్స్ పైన దృష్టి సారింపు

డిజిటల్ స్కిల్స్ పైన దృష్టి సారింపు

తాము డిజిటల్ స్కిల్స్ పైన దృష్టి సారించామని, ఈ క్రమంలో భారత్‌లో ఈ ఏడాది దాదాపు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందని, DXC ఇందుకోసం ఇప్పటికే జిడిటల్ నేటివిటీ పరీక్షను నిర్వహించిందని కంపెనీ డెలివరీ అండ్ ఆపరేషన్స్ చీఫ్ శామ్సన్ డేవిడ్ అన్నారు. వివిధ క్యాంపస్‌లలో ఇప్పటికే 1,500 మందిని నియమించుకుందని తెలిపారు.

భారత్‌లో 45,000 మంది ఉద్యోగులు

భారత్‌లో 45,000 మంది ఉద్యోగులు

CSC, హెల్వెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజెస్ విలీనం అనంతరం 2017లో ఈ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి భారత్‌లో 45,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,30,000 మమంది ఉద్యోగులతో పోలిస్తే భారత్‌లోని ఉద్యోగుల సంఖ్య దాదాపు 40 శాతం. మూడో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ ట్యాగ్‌ను ఇది టాటా సర్వీసెస్‌కు కోల్పోయింది. టాటా డబుల్ డిజిట్ గ్రోత్‌లో ఉంది.

10 వేల మందికి ఛాన్స్

10 వేల మందికి ఛాన్స్

భారత్‌లో ఉద్యోగులను నియమించుకుంటూనే ఉంటామని, దాదాపు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 10 వేల మందిని నియమించుకునే అవకాశాలు ఉన్నాయని, డిజిటల్ స్కిల్స్ పైన మంచి నైపుణ్యం కలిగిన వారిపై దృష్టి సారించామని శామ్సన్ డేవిడ్ అన్నారు.

100 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయింది..

100 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయింది..

DXC టెక్నాలజీ అమెరికా బయట తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మార్కెట్‌లోని ప్రతిభావంతుల కోసం అన్వేషిస్తోంది. గత నవంబర్ నెలలో కంపెనీ సీఈవో జాన్ మిచెల్ లారీ మాట్లాడుతూ... ఉద్యోగుల కొరత కారణంగా కంపెనీ దాదాపు 100 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు.

డిజిటల్ గ్రోత్ సోర్సెస్‌కు సమయం తీసుకుంటోంది..

డిజిటల్ గ్రోత్ సోర్సెస్‌కు సమయం తీసుకుంటోంది..

పెద్ద పెద్ద డిజిటల్ కాంట్రాక్ట్స్‌లలో తాము ఆలస్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని, అదే సమయంలో తమ డిజిటల్ సొల్యూషన్స్‌కు సంబంధించి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, డిజిటల్ వృద్ధి సోర్సెస్‌ను తీసుకు రావడానికి మేం ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని జాన్ మిచెల్ లారీ అన్నారు.

1500 మంది క్యాంపస్ నుంచి

1500 మంది క్యాంపస్ నుంచి

DXC టెక్నాలజీ 20 బిలియన్ డాలర్ల కంపెనీ. ఇది డిజిటల్ టాలెంట్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. DXC సంబంధిత అంశాల్లో డిజిటల్ నేటివిటీ టెస్టులను నిర్వహించింది. 10,000 మంది కొత్త ఉద్యోగులకు గాను 1500 మందిని క్యాంపస్ నుంచి తీసుకోనున్నట్లు శామ్సన్ డేవిడ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+