For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్ ఆఫర్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది!

|

స్టాక్ మార్కెట్లు నష్టాలబాట పడుతున్నాయి. ఆర్థిక మందగమనం, ప్రపంచ మార్కెట్ల ఊగిసలాట, డాలర్ మారకంతో బలహీనపడుతున్న రూపాయి.. ఇలా పలు కారణాలు మార్కెట్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఇటీవల 12,000 పాయింట్ల గరిష్టానికి చేరుకున్న నిఫ్టీ అప్పటి నుంచి దాదాపు 10 శాతం నష్టపోయింది. ప్రస్తుతం డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ చాలామందిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు 4 డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్: అప్లై ఎలా చేసుకోవాలి, ధరలు ఎంత?సెప్టెంబర్ 5న జియో గిగా ఫైబర్: అప్లై ఎలా చేసుకోవాలి, ధరలు ఎంత?

జాగ్రన్ ప్రకాశన్

జాగ్రన్ ప్రకాశన్

జాగ్రన్ ప్రకాశన్‌లో మీరు ఇప్పుడు స్టాక్స్ కొనుగోలు చేస్తే ఒక్కో షేరుకు రూ.3.5 డివిడెండ్ లభిస్తుంది. ప్రస్తుతం దీని మార్కెట్ ధర రూ.63గా ఉంది. 5.6 శాతం వరకు డివిడెండ్ లభిస్తుంది. డిజిటల్, ప్రింట్, రేడియో వ్యాపారంలో జాగ్రన్ ప్రకాశన్ అతిపెద్ద సంస్థ. భారత్‌లోని అతిపెద్ద న్యూస్ పేపర్ దైనిక్ జాగ్రన్, రేడియో సిటీ, ముంబైలోని లార్జెస్ట్ ఈవినింగ్ పేపర్ మిడ్ డే కూడా ఈ సంస్థవే. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్‌లోను నెంబర్ వన్ వెబ్ సైట్స్ కలిగి ఉంది. జూన్ 30, 2019తో ముగిసిన క్వార్టర్‍‌లో నెట్ ప్రాఫిట్ రూ.65.7 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో దీని నెట్ ప్రాఫిట్ రూ.88.4 కోట్లుగా ఉంది. అయితే న్యూస్ ప్రింట్ ధరలు తగ్గినందున రానున్న క్వార్టర్‌లో మరింత లాభాన్ని ఆర్జించే అవకాశముంది. జాగ్రన్ ప్రకాశన్ మంచి డివిడెండ్ వద్ద లభిస్తోంది. లాంగ్ టర్మ్ కోసం దీనిని కొనుగోలు చేయవచ్చు.

కర్ణాటక బ్యాంకు

కర్ణాటక బ్యాంకు

గత కొన్నేళ్లుగా డివిడెండ్ ప్రకటిస్తున్న సంస్థల్లో కర్ణాటక బ్యాంక్ ఉంది. వాస్తవానికి బ్యాంకులు ఎన్పీఏలతో సతమతమవుతున్నాయి. లాభదాయక ఒత్తిడిలో ఉన్నాయి. కానీ ఈ ప్రభావం కర్ణాటక బ్యాంకు పైన చాలా తక్కువగా ఉంది. ఈ బ్యాంకు బోర్డు 2019లో చివరిసారి రూ.3.5 డివిడెండ్ ప్రకటించింది. అదే డివిడెండ్ కొనసాగిస్తే కనుక స్టాక్స్ రూ.75 వద్ద ఉంటే 4.7 శాతం అవుతుంది. అయితే పరిశ్రమలో మందగమనం ప్రభావం కాస్త పడవచ్చు. మంచి డివిడెండ్, మంచి రిటర్న్స్ కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు.

కోల్ ఇండియా

కోల్ ఇండియా

కోల్ ఇండియా షేర్లు 52 వారాల గరిష్టం రూ.292 నుంచి ఇప్పుడు రూ.181కి పడిపోయాయి. గత సంవత్సరం డివిడెండ్స్ ఆధారంగా కోల్ ఇండియా 7.24 శాతం అందించవచ్చు. బ్యాంకు డిపాజిట్లు ఇచ్చే వడ్డీ రేటుకు ఈ డివిడెండ్ దాదాపు సమానం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఇన్వెస్టర్ల చేతిలో డివిడెండ్స్ ట్యాక్స్ ఫ్రీ. బ్యాంక్ డిపాజిట్స్ వడ్డీపై అలా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కోల్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయమే! ప్రస్తుతం ఈ స్టాక్స్ 52 వారాల కనిష్టంలో రూ.181 వద్ద ఉంది. డివిడెండ్ దిగుబడిని బట్టి చూస్తే ఈ స్టాక్స్‌పై ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఓఎన్జీసీ

ఓఎన్జీసీ

మంచి డివిడెండ్ ఇస్తున్న స్టాక్స్‌ల్లో ఓఎన్జీసీ కూడా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర రూ.117గా ఉంది. ఇది 52 వారాల కనిష్టానికి పడిపోయింది. స్టాక్స్ పైన డివిడెండ్ 6 శాతం వరకు ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేయడం మరీ నష్టమేమీ కాదు. అతిపెద్ద ఆయిల్, గ్యాస్ అన్వేషణ సంస్థ ఓఎన్జీసీ. వ్యాపార అవకాశాలు భరోసా ఇచ్చే విధంగా, స్థిరంగా ఉన్నాయి. ఈ స్టాక్స్ మంచి డివిడెండ్ ఇస్తున్నాయి. అదే సమయంలో 52 వారాల కనిష్టానికి కొనుగోలు చేయవచ్చు.

English summary

సూపర్ ఆఫర్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది! | 4 Dividend Stocks You Should Buy In A Depressed Market

Markets have fallen a great deal, with the Nifty shedding almost 10 per cent since hitting peak levels of 12,000 points. Dividend yield on select stocks have become extremely attractive for investors. Here are 4 dividend stocks that are a must buy at the current levels.
Story first published: Wednesday, September 4, 2019, 15:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X