న్యూఢిల్లీ: వరల్డ్ క్లాస్ అనుభూతినిచ్చే ఇండియన్ తొలి ప్రైవేటు రైలులో విమానం కంటే తక్కువ ధరలకే ప్రయాణం చేయవచ్చు. వచ్చే నెలలో ఒకటి, నవంబర్ నెలలో మరో ప్రైవేటు రైలు ప్రారంభం కానుంది. అయితే అదే మార్గంలో నడిచే విమానం ధర కంటే ఇది తక్కువ. సమాచారం మేరకు లక్నో - ఢిల్లీ, అహ్మదాబాద్ - ముంబై తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను టెస్ట్ కేసులుగా నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ఇండియన్ రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులకు ఇది తొలి అడుగు. ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలు తక్కువగా ఉంటాయి. మరిన్ని వివరాలు.....

విమాన ఛార్జీల్లో సగం ధర
అదే మార్గంలోని విమాన ధరల కంటే తేజాస్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేటు రైలు ఛార్జీలు 50 శాతం తక్కువగా ఉంటాయి. పీక్ సీజన్‌లో ఎక్కువ ఛార్జీలను వసూలు చేసే సౌకర్యం ఉంది. అలాంటి సమయాల్లో చూసినా విమాన ఛార్జీ కంటే తక్కువగా ఉంటుంది.

ఎవరికీ ప్రత్యేక ఆఫర్లు లేవు.. అందరూ సమానమే
తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో మరో ఆసక్తికర విషయం ఏమంటే ఏ ప్రయాణీకుడికి లేదా ఏ వీఐపీకి కూడా ప్రత్యేక రాయితీలు ఇవ్వవు లేదా ప్రత్యేక కోటా ఉండదు. ఇండియన్ రైల్వేస్‌లో 53 కేటగిరీల్లోని వారికి టిక్కెట్ కన్సేషన్ ఉంటుంది. సీనియర్ సిటిజన్లు, పేషెంట్లు, అవార్డు విన్నర్స్ వంటి వారికి ఉంటుంది. కానీ ఈ ప్రైవేటు రైలులో అలాంటి సౌకర్యాలు ఉండవు.

రూ.50 లక్షల ప్రయాణ బీమా
ఈ ప్రైవేటు రైలులో ప్రయాణించే వారికి ఐదేళ్ల పైబడిన పిల్లలకు పూర్తి చార్జీ వసూలు చేస్తారు. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రైవేటు కంపెనీల నుంచి రూ.50 లక్షల వరకు ప్రయాణ బీమా అందిస్తారు. వీటికి సంబంధించి ఇండియన్ రైల్వేస్, IRCTC ఒప్పందం పూర్తైన తర్వాత ఈ సేవలు ఖరారు చేస్తారు.

సౌకర్యాలు అదుర్స్....
తేజాస్ రైలు అందించే కొన్ని ప్రత్యేక సౌకర్యాలు.. అత్యాధునీక ఇంటీరియర్స్, అటెండెంట్ కాల్ బటన్స్, ఎల్ఈడీ టెలివిజన్స్, ఆటోమెటిక్ డోర్స్, సీసీటీవీ కెమెరాలు, మాడ్యులర్ బయో టాయిలెట్స్, మోబైల్ చార్జింగ్ పాయింట్స్, ఎయిర్ కండిషన్డ్ కోచ్, పర్సనలైజ్డ్ రీడింగ్ లైట్స్ తదితర సదుపాయాలు ఉంటాయి.

విమాన మోడల్ టాయిలెట్స్
తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విమానాశ్రయ మోడల్ టాయిలెట్స్ ఉంటాయి. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ లక్నో - ఢిల్లీ, అహ్మదాబాద్ - ముంబై తేజాస్ ఎక్స్ ప్రెస్ రైళ్ల తాత్కాలిక షెడ్యూల్స్ విడుదల చేసింది. ఐఆర్‌సీడీసీ ఇష్యూ చేసిన పేపర్ టిక్కెట్, ఎం టిక్కెట్, ఈ టిక్కెట్ ద్వారా అనుమతి ఉంటుంది.


Click it and Unblock the Notifications