ఢిల్లీ: ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పడిపోవడంతో ఈ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆయా కంపెనీల వాహన విక్రయాలు దాదాపు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో దేశంలో ఈ పరిశ్రమలో 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) తెలిపింది. గత కొన్ని క్వార్టర్లలో వాహన విక్రయాలు తగ్గుతున్నాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది.

క్షీణించిన వాహన విక్రయాలు
వాహనాల విక్రయాలు క్షీణిస్తుండటంతో ఆటోమొబైల్ షోరూమ్‌లలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నారని, పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడే ఈ రంగం కోలుకొనేలా కనిపించడం లేదని, కాబట్టి ఉద్యోగాల కోత మరింత పెరగవచ్చునని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని వాహనాలపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని FADA కోరింది.

ఇది ఆందోళన కలిగించే అంశం...
మే నెలలో మొదలైన ఉద్యోగాల కోత జూన్, జూలై నెలల్లోను కొనసాగిందని పేర్కొంది. ఇప్పటి వరకు షోరూమ్‌లలో అమ్మకాల బాధ్యతలు చూసే ఉద్యోగులను తొలగించారని, పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఇలాగే కొనసాగితే టెక్నికల్ ఎంప్లాయీస్‌కు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని పేర్కొంది. వాహన విక్రయాలు తగ్గితే సర్వీస్ (సెంటర్లు)లు కూడా తగ్గుతాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది.

షోరూంలు మూతబడే పరిస్థితి...
సేల్స్ లేక భవిష్యత్తులో కొన్ని షోరూమ్‌లు మూతపడే పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. గత మూడు నాలుగేళ్లలో సేల్స్ పైన డీలర్లకు మార్జిన్లు పెరగలేదని, కానీ షోరూంల వ్యయం మాత్రం దాదాపు రెట్టింపు అయిందని, ఇప్పుడు అమ్మకాలు తగ్గాయని FADA ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.

విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో...
విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో వ్యయ నియంత్రణ చర్యలు ప్రారంభించారని, అయినా ఫలితం లేకపోవడంతో చివరి ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల తొలగింపు మొదలైందని చెప్పారు. కాగా, దేశంలో 26,000 ఆటో మొబైల్ షోరూమ్‌లు ఉన్నాయి. 15,000 మంది డీలర్స్ ఉన్నారు. 2.5 మిలియన్‌ల మంది ఉద్యోగం చేస్తున్నారు. మరో 2.5 మిలియన్ల మంది పరోక్ష ఉపాధి పొందుతున్నారు. పద్దెనిమిది నెలల్లో (ఈ ఏడాది ఏప్రిల్ వరకు) 271 నగరాల్లో 286 షోరూంలు మూసివేయడం వల్ల 32వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలిపారు.

విక్రయాలు ఇలా పడిపోయాయి..
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) ప్రకారం వాహన విక్రయాలు 12.35 శాతం తగ్గాయి. గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 69,42,742 సేల్స్ ఉండగా, ఈ ఏడాది 60,85,406 మాత్రమే. ఆటో మొబైల్ రిటేల్ సేల్స్ ఏప్రిల్ - జూన్ పీరియడ్‌లో 6 సాతం తగ్గి 54,42,317 (అంతకుముందు ఏడాది) నుంచి 51,16,718 దిగజారాయి. పాసింజర్ వెహికిల్స్ సేల్స్ కూడా బాగా పడిపోయాయి.య
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications