For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర పెరిగింది.... రుణ ఎగవేతలు తగ్గాయ్

|

బంగారం ధరలు ఈ మధ్య కాలంలో బాగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బంగారం కొనుగోలు చేసినవారు సంబరపడి పోతుండగా.. పసిడి ధరలు తగ్గుతాయని ఆశించిన వారు నొచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ధరల పెరుగుదల వల్ల బంగారం పై రుణాలు ఇచ్చిన బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలు, రుణాలు తీసుకున్నవారు కూడా ఊరట చెందుతున్నారు. ఎందుకంటే బంగారం ధర పెరగడం వల్ల రుణాలు తీసుకున్నవారిలో ఎక్కువ మంది తమ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించి బంగారాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. దీని వల్ల రుణాలు ఇచ్చిన సంస్థలకు ఎగవేతలు తగ్గుతున్నాయి. బంగారం ధర తగ్గితే చాలామంది తాము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆభరణాలు లేదా బంగారాన్ని వదులుకుంటున్నారు. వచ్చే ఏడాదిలోను బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా.

ఇదీ లెక్క

* సాధారణంగా బంగారం, బంగారు ఆభరణాల విలువపై 75 శాతం లోపే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు రుణాన్ని ఇస్తుంటాయి. అంటే ఇచ్చే రుణంకన్నా తమదగ్గర ఉండే బంగారం విలువ ఎక్కువగా ఉంటుంది. అది సెక్యూరిటీగా ఉంటుంది.
* ఇప్పుడు బంగారం విలువ పెరగడం వల్ల హామీగా ఇచ్చిన బంగారం విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి రుణం ఇచ్చిన సంస్థలు దర్జాగా ఉన్నాయి.
* ఉదాహరణకు 10 గ్రాముల బంగారం ధర రూ. 32 వేలు ఉంటే దానిపై 75 శాతం అంటే రూ. 24,000 రుణాన్ని మాత్రమే ఇస్తారు. మిగతా రూ,8,000 అదనపు మొత్తం రుణాన్ని ఇచ్చిన సంస్థ వద్ద ఉంటుంది. ఒకవేళ ధర రూ. 36,000 కు పెరిగితే ఇది రూ. 12,000 కు పెరుగుతుంది. కాబట్టి రుణాలు తీసుకున్నవారు చెల్లించడానికి వెనుకాడే అవకాశం ఉండదు.

Gold price hiked, number of Loan defaulters down

11.50 శాతం పెరుగుదల

* ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు 11.50 శాతం వరకు పెరిగాయి.
* కాబట్టి అత్యవసర సమయంలో బంగారంపై ఎక్కువ రుణాన్ని తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది.
* సాధారణంగా ఆభరణాలపై రుణం తీసుకున్న వారు నిర్దేశిత కాలంలో రుణాన్ని చెల్లించకపోతే ఆభరణాలను ఆర్ధిక సంస్థలు వేలం వేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఇలాంటి పరిణామాలు తక్కువగా ఉంటున్నాయని ఈ రంగ వర్గాలు చెబుతున్నాయి.

కొద్దికాలమేనా....

* బంగారం ధరలు పెరిగే కొద్దీ బంగారంపై రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. చిన్న, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రుణాలు తీసుకోవద్దని ముందుకు వస్తారు.
* అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదని ధరలు స్థిర పడగానే వ్యాపారం సాధారణ స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు.
* బంగారం ధరల పెరుగుదల వల్ల మొండిపద్దులు తగ్గి, రుణ వితరణ సంస్థల నిర్వహణలో ఆస్తులు పెరగడానికి అవకాశం ఉంటుంది.

English summary

బంగారం ధర పెరిగింది.... రుణ ఎగవేతలు తగ్గాయ్ | Gold price hiked, number of Loan defaulters down

Gold prices are set to rise next year also as the US Federal Reserve slows the pace of interest rate hikes.
Story first published: Wednesday, July 31, 2019, 14:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X