For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్, చైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలా?: ట్రంప్ ఆగ్రహం

|

వాషింగ్టన్: చైనా, భారత్ దేశాలతో అమెరికాకు వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మనతో కాస్త చల్లబడినప్పటికీ, చైనాతో ఎప్పటికప్పుడు కొత్త అంశం తెరపైకి వస్తోంది. తాజాగా, చైనాలోని ఉత్పత్తులను తీసుకువస్తే అధిక టారిఫ్ విధిస్తామని ఆపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ట్రంప్ చైనా, భారత్‌ల పైకి మరో ఆయుధాన్ని విసిరారు.

చైనా అంటే భారీ టారిఫ్, ముందే చెప్పాచైనా అంటే భారీ టారిఫ్, ముందే చెప్పా

అభివృద్ధి చెందుతున్న దేశాల పేరుతో ప్రత్యేక ప్రయోజనాలు

అభివృద్ధి చెందుతున్న దేశాల పేరుతో ప్రత్యేక ప్రయోజనాలు

అభివృద్ధి చెందుతున్న దేశాల పేరుతో చైనా, భారత్‌లో ప్రత్యేక, వివిధ రకాల ప్రయోజనాలు పొందుతున్నాయని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. WTO రూల్స్ మేరకు ఈ దేశాలు లాభపడుతున్నాయని, కాబట్టి ఈ దిశగా సరైన చర్యలు తీసుకోవాలని తమ వాణిజ్య ప్రతినిధులకు ట్రంప్ సూచించారు. ఈ మేరకు ట్రంప్ ట్వీట్ కూడా చేశారు.

ఇక అలాంటివి చెల్లవ్

ఇక అలాంటివి చెల్లవ్

ప్రపంచంలోని ధనిక దేశాలు ఇంకా డెవలపింగ్ దేశాలుగా ఉంటూ డబ్ల్యుటీవో నిబంధనల మేరకు ప్రత్యేక అర్హతలు పొందుతున్నాయని, ఇక అలాంటివి చెల్లవని ట్రంప్ అన్నారు. ఈ రోజు తాను అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్స్‌కు సరైన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశానని, అమెరికా నిధులతో ఆ దేశాలు లాభపడుతూ చీటింగ్ చేస్తున్నాయని దానిని అడ్డుకునే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు.

ట్రంప్ ఆదేశాలతో...

ట్రంప్ ఆదేశాలతో...

ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో యూఎస్ ట్రేడ్ రిప్రజంటేటివ్ రాబర్డ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ధనిక దేశాలు చాలా కాలంగా ప్రత్యేక ప్రయోజనాలు పొందడం ద్వారా డబ్ల్యుటీవో నిబంధనలను అవమానించాయని, ఇది అమెరికాకు నష్టం చేస్తోందని, తమ అధ్యక్షులు ట్రంప్ డిమాండుకు తాము పూర్తి మద్దతిస్తున్నామని, ఆయన సూచనలు ఆచరణయోగ్యమయ్యే దిశలో అడుగేస్తామన్నారు.

English summary

భారత్, చైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలా?: ట్రంప్ ఆగ్రహం | Trump targets India and China, asks WTO to tweak developing country status

The US president Donald Trump has upped the ante on the special and differential status enjoyed by large developing countries such as China and India under WTO rules by asking his trade representative to take necessary action.
Story first published: Sunday, July 28, 2019, 18:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X