వాషింగ్టన్: టారిఫ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక టారిఫ్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఆపిల్ చైనాలో తన కొత్త తయారీ యూనిట్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ యూనిట్స్‌ను అమెరికాకు షిఫ్ట్ చేయాలని ట్రంప్ సదరు టెక్ దిగ్గజంపై ఒత్తిడి చేస్తున్నాడు.

ఆపిల్‌కు టారిఫ్ ఉపశమనం ఉండదు
ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తుల విషయంలో ఆపిల్ కంపెనీకి అమెరికాలో ఎలాంటి టారిఫ్ ఉపశమనం లభించదని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. ఆపిల్ కంపెనీ తన యూనిట్‌ను అమెరికాలో ఏర్పాటు చేసి, ఆ ఉత్పత్తులను ఇక్కడే తయారు చేయాలన్నాడు.

ఆపిల్‌కు అప్పుడే చెప్పా..
ఆపిల్ సంస్థ తన కార్యకలాపాల్ని చైనాలో ప్రారంభిస్తుందని తెలిసినప్పుడే తాను వారికి స్పష్టంగా చెప్పానని, మీ ఉత్పత్తులు చైనా నుంచి వస్తే కనుక అధిక టారిఫ్ ఉంటుందని తేల్చి చెప్పానని ట్రంప్ గుర్తు చేశారు. అక్కడి నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఆపిల్ ఉత్పత్తులపై ఎక్కువ స్థాయిలో టారిఫ్ విధిస్తామన్నారు.

టెక్సాస్‌లో యూనిట్ ఏర్పాటు చేస్తే సంతోషం
ఆపిల్ సంస్థ చీఫ టిమ్ కుక్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, సమీప భవిష్యత్తంలో టెక్సాస్‌లో యూనిట్స్ ఏర్పాటు చేస్తామంటే ఎంతో సంతోషిస్తామని ట్రంప్ అన్నాడు. టారిఫ్ గురించి కూడా పునరాలోచన చేస్తామన్నాడు. అమెరికాలో చేసే ఉత్పత్తులపై ఇలా టారిఫ్ ఉండదని పేర్కొన్నాడు.

ఆపిల్ విజ్ఞప్తికి ట్రంప్ నో
కాగా, గత వారం ఆపిల్.. అమెరికా ట్రేడ్ రిప్రజంటేటివ్స్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. చైనా నుంచి ఉత్పత్తి అయ్యే తమ 6,000 డాలర్ల(దాదాపు రూ.4,13,200) మాక్ ప్రో డెస్క్‌టాప్ కంప్యూటర్ విడి భాగాలు చైనా నుంచి ఉత్పత్తి అవుతాయని, వాటిపై టారిఫ్ వెసులుబాటు కల్పించాలని కోరింది. ఇప్పటికే అమెరికా - చైనా మధ్య టారిఫ్ యుద్ధం నడుస్తోంది. ఇటీవల అనుకూల పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు ఆపిల్ ఉత్పత్తుల నేపథ్యంలో మరోసారి టారిఫ్ వేడి రాజుకుంది. బీజింగ్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అధిక టారిఫ్ విధిస్తామని, అమెరికా మేధో సంపత్తి రక్షణను మరింత మెరుగుపరుస్తామని ట్రంప్ చెబుతున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications