న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. వివిధ ఇష్యూల కారణంగా దీనిని పొడిగించాలనే డిమాండ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఐటీ రిటర్న్స్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. 2018-19ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఆగస్ట్ 31, 2019 వరకు గడువును పొడిగించింది.
ఐటీ రిటర్న్స్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది పెద్ద ఊరట కలిగించే విషయం. సాధారణంగా గత ఏడాదికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31. ఇప్పుడు ఆ గడువును కేంద్రం నెల రోజులు పొడిగించింది. 'ఐటీ రిటర్న్స్ సమర్పణ గడువు తేదీని జులై 31, 2019 నుంచి ఆగస్ట్ 31, 2019 వరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పెంచింది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంద'ని ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

తాజాగా పెంచిన గడువు ప్రకారం ఆగస్ట్ 31వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైన్ ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీలోగా ఫైల్ చేస్తే రూ.5,000, ఆ తర్వాత మార్చి 31, 2020 వరకు ఫైల్ చేస్తే రూ.10,000 ఫైన్ చెల్లించాలి.
కాగా, ఉద్యోగులకు ఫాం 16 ఆలస్యం కావడం, వాటిలో తప్పులు గుర్తించి సవరించిన డాక్యుమెంట్స్‌ను కంపెనీల నుంచి తిరిగి పొందేందుకు మరింత సమయం అవసరమైనందున గడువు తేదీని పొడిగించే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) సంఘాలు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ, CBDT సానుకూలంగా స్పందించవచ్చునని భావించారు. ఆ మేరకు నెల రోజులు గడువు పెంచారు. వేతనజీవులకు యాజమాన్యాలు జూలై 10వ తేదీలోపు ఫాం 16 ఇష్యూ చేయాలని డెడ్ లైన్ విధించారు. అలాగే ఉద్యోగులు తమ ఐటీ రిటర్న్స్ జూలై 31లోపు దాఖలు చేయాలి. అంటే గడువు 21 రోజులు మాత్రమే. తక్కువ సమయం ఉన్నందున పొడిగిస్తారని భావించారు.
పన్ను చెల్లింపుదారులకు వారి ఇన్‌కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తగిన సమయం ఇవ్వడానికి, రిటర్న్ ఫైలింగ్ తేదీని పొడిగించాలని డిమాండ్స్ వచ్చాయి. ఫారం 16 సవరించారని, కాబట్టి వేతనజీవులకు కాస్త సమయం ఇవ్వాలని, అప్పుడే వారు ఎర్రర్స్ సరిగ్గా చూసుకోగలరనే వాదనలు వినిపించాయి. యాజమాన్యం జారీ చేసిన ఫాం 16లో లోపాలు గుర్తించేందుకు ఉద్యోగులకు సమయం పడుతుందని, ఆ తర్వాత దానిని యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లాలని, అప్పుడు యాజమాన్యం దానిని సరిచేసి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ తతంగానికి సమయం తీసుకుంటుందని, కాబట్టి ఈ కారణంతో కూడా తేదీని పొడిగించాలని ఎంతోమంది డిమాండ్ చేసారు. ఇప్పుడు కేంద్రం ఊరట కల్పించింది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications