న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు మరో వారం రోజుల్లో (జూలై 31) ముగియనుంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఐటీఆర్ దాఖలు చేస్తున్నప్పుడు ఆధార్ కార్డు నెంబర్‌ను పేర్కొనవలసి ఉంటుంది. దాంతో పాటు పన్ను చెల్లింపుదారులు వారి పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయాల్సిన విషయం తెలిసిందే. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు.

ఆధార్ నెంబర్ ఇవ్వాలి
ఈ మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఇదివరకే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆధార్ మెన్షన్ చేయాలని చెప్పింది. సెక్షన్ 139AA (1)(ii) ప్రకారం.. ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఆధార్ నంబర్‌ను పేర్కొనడం తప్పనిసరి అని CBDT తెలియజేసింది. అంతేకాకుండా, ఆధార్ సంఖ్యను పేర్కొనకుండా పన్ను రిటర్న్ దాఖలు చేయలేమని సిబిడిటి తెలియజేసింది. అది ఎలక్ట్రానిక్ అయినా లేదా మ్యాన్యువల్ అయినా.

పాన్ స్థానంలో ఆధార్ ఇవ్వొచ్చు
పాన్ కార్డు అవసరమైనచోట ఆధార్ కార్డు ఉపయోగించవచ్చునని ఇటీవల బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు. అంటే పాన్ లేని వారు తమ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయగలుగుతారు. పాన్ కార్డు లేనివారు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తుంటే కనుక.. పాన్ వివరాలు అడిగిన చోట ఆధార్ వివరాలు ఇవ్వవచ్చు.

అడిషనల్ స్పేస్... ఆధార్ కార్డు లేకుంటే...
పన్ను చెల్లింపుదారులు వారి ఆధార్ నంబర్‌ను ఐటీ రిటర్న్స్‌లో పేర్కొనడానికి ఐటిఆర్ ఫారమ్స్‌ల్లో అడిషనల్ స్పేస్ ఇచ్చారు. అక్కడ అతను/ఆమె ఆధార్ నెంబర్‌ను పొందుపరచాల్సి ఉంది. ఏదేమైనా, ఒక వ్యక్తి ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పటికీ, ఇంకా అందుకోని సందర్భంలో, అలాంటి వారు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ (28 అంకెల ఐడి)ను ఐటీ రిటర్న్స్‌లో పేర్కొనవచ్చు.

క్రాస్ చెక్ చేయండి
Incometaxefiling.gov.in వెబ్‌సైట్‌లో ITR1 ఆన్‌లైన్‌లో దాఖలు చేస్తుంటే... ఇంతకుముందు ఈసి రిటర్న్‌లో ఆధార్ నంబర్‌ను కోట్ చేసి ఉంటే, అప్పటికే ఆధార్ నంబర్ ముందే నింపబడి ఉండవచ్చు. ఐటిఆర్ 1లో పార్ట్ ఎ జనరల్ ఇన్ఫర్మేషన్‌లో ఈ సమాచారం ముందే నింపబడి ఉంటుంది. అయినప్పటికీ ఆధార్ సంఖ్యను క్రాస్ చెక్ చేయాలి. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోండి. ఎవరైనా ఇండివిడ్యువల్స్ జావా యుటిలిటీ లేదా ఎక్సెల్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే మ్యాన్యువల్‌గా ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications