For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF రూల్స్ మారాయి, మీరు డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు!!

|

న్యూఢిల్లీ: ఎంతోమంది ప్రావిడెంట్ ఫండ్ అప్‌డెట్స్ తెలుసుకోరు. పీఎఫ్ అకౌంట్ ఉపసంహరించుకునే సమయంలో లేదా ట్రాన్సుఫర్ చేసే సమయంలో మాత్రమే చాలామంది దీని గురించి ఆలోచిస్తుంటారు. ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల ఈపీఎఫ్ అకౌంట్‌కు జమ అవుతాయి. కంపెనీ కూడా అంతేమొత్తం కాంట్రిబ్యూట్ చేస్తుంది. తాజాగా, EPFO ఓ నిబంధన మార్చిందట. ఈ కొత్త నిబంధనల ప్రకారం మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకోలేరట. అయిదే దీనికి ఓ షరతు కూడా ఉంది.

ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్: వడ్డీ రేటు పెంచిన 8.65 శాతమే

యూఏన్‌తో లింక్ అయితే విత్ డ్రా చేసుకోలేరు

యూఏన్‌తో లింక్ అయితే విత్ డ్రా చేసుకోలేరు

సాధారణంగా ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులను అవసరాలకు అనుగుణంగా విత్ డ్రా చేసుకోవచ్చు. తాజాగా మారిన రూల్ ప్రకారం ఉద్యోగి ఆదార్ నెంబర్ UAN (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) నెంబర్‌తో అనుసంధానమై ఉంటే అప్పుడు ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకులేరు. ఇలాంటి సందర్భాల్లో ఈపీఎఫ్ఓ.. PF క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది. UAN ఆధార్‌తో లింక్ అయి ఉంటే అప్పుడు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలి.

ఈ నిర్ణయం ఎందుకు...

ఈ నిర్ణయం ఎందుకు...

యూఏఎన్‌తో ఆధార్ లింక్ అయినప్పటికీ ఎన్నో కంపెనీలకు చెందిన ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో క్లెయిమ్స్ వస్తున్నాయట. ఫిజికల్ ఫాం ద్వారా క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాంటి కేసుల వల్ల ఆలస్యంతో పాటు ఫీల్డ్ ఆఫీస్ పైన భారం పడుతోందని చెబుతున్నారు. అందుకే ఆఫ్‌లైన్ క్లెయిమ్స్ అంగీకరించవద్దని ఆదేశించారట. అందుకే ఆన్‌లైన్ క్లెయిమ్ సర్వీస్ ప్లాట్‌ఫాంను ఉపయోగించాలని కంపెనీలకు సూచించారు. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, ఆన్ లైన్ అంగీకరించబడుతుంది.

ఆన్‌లైన్ ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవాలి

ఆన్‌లైన్ ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవాలి

- EPFO వెబ్ సైట్ http://www.epfindia.com/site_en/ ఓపెన్ చేయండి.

- హోమ్ పేజీలోని ఆన్‌లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.

- https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పైన క్లిక్ చేయండి.

- ఇది మీ UAN నెంబర్ అడుగుతుంది. అలాగే పాస్ వర్డ్ అవసరం.

- ఆ తర్వాత మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

- మీరు కంపెనీకి విత్‌డ్రా ఫాంను సబ్ మిట్ చేయాల్సిన అవసరం లేదు.

- ఫీల్డ్ ఆఫీసర్ ఆటోమేటిక్‌గా ఆన్ లైన్ క్లెయిమ్‌ను వెరిఫై చేసుకుంటారు. అయితే ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మీ KYC పూర్తయి ఉండాలి.

English summary

Employees won't be able to take out their PF money this way anymore

EPF withdrawal update: Most employees remain unaware of the developments related to provident fund, and they are merely concerned about the amount being deducted as Provident Fund (PF) from their salary.
Story first published: Sunday, July 21, 2019, 19:23 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more