న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ వడ్డీ రేటు 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతంగా ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. 2017-18లో 8.55 శాతం వడ్డీ ఉన్న రేటును 8.65 శాతం చేస్తూ కొద్ది నెలల క్రితం EPFO నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వడ్డీ రేటు పెంపు నిర్ణయాన్ని సమీక్షించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ EPFO మాత్రం వడ్డీ రేటు పెంపు ఉంటుందని పేర్కొంది.

ఉద్యోగులకు గుడ్ న్యూస్
8.55 శాతం నుంచి 8.65కి పెంచిన వడ్డీ రేటును స్థిరపరచాలని EPFO తెలిపింది. దీంతో సుమారు 4.5 కోట్ల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు లబ్ధి చేకూరుతుందని అంచనా. వడ్డీ రేటును పెంచినప్పటికీ సంస్థ వద్ద మిగులు రూ.150 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. వడ్డీ రేటు పెంపు సందర్భాల్లో ఆర్థిక శాఖ.. సమీక్షించాలని కోరడం సాధారణమేనని చెబుతున్నారు. 190 బిలియన్ డాలర్ల ఆస్తులకు పైగా నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, రూ.5.75 బిలియన్లను ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిందని చెబుతున్నారు. అయితే ఇది 0.1 శాతం కంటే తక్కువ.

ఏం జరిగింది?
పీఎఫ్ అకౌంట్ పైన అందించే వడ్డీ రేటు పెంపు నిర్ణయానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆసక్తిగా లేదని వార్తలు వచ్చాయి. వడ్డీ రేటు నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని ఆర్థిక శాఖ కూడా ఈపీఎఫ్ఓను కోరిందని మీడియాలో వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వడ్డీ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్భణం, డిపాజిట్లు సమీకరించడం కష్టమవుతుందనే బ్యాంకుల ఆందోళన వంటి పలు కారణాలతో ఆర్థిక శాఖ సమీక్ష కోరిందని తెలుస్తోంది. అయితే ఈపీఎఫ్ఓ ప్రకటన పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు భారీ ఊరట.

బ్యాంకుల ఆందోళన.. అయినా ఉద్యోగుల వైపే మొగ్గు
EPFO బోర్డు పీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటును కొద్ది నెలల క్రితం పెంచింది. బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచలేకపోతున్నాయి. పీపీఎఫ్ లాంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంకులు కోరాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం మరోవైపు, బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ తక్కువగా ఉండటంతో బ్యాంకులకు నిధుల సమీకరణ కష్టమవుతోంది. అందుకే వడ్డీ తగ్గించాలని బ్యాంకులు ఒత్తిడి చేశాయి. అయినప్పటికీ వడ్డీ రేటు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఈపీఎఫ్ఓ తగ్గలేదు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications