న్యూఢిల్లీ: విదేశీ కరెన్సీ డెబిట్ ఇష్యూ చేయాలన్న భారత ప్రభుత్వం నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగవని, అదే సమయంలో ఎంతో రిస్క్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. శనివారం నాడు టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో ఆయన విదేశీ బాండ్ల జారీ అంశాన్ని ప్రస్తావించారు. వీటితో ప్రయోజనం తక్కువ, రిస్క్ ఎక్కువ అన్నారు. గ్లోబల్ మార్కెట్లో విదేశీ కరెన్సీల్లో ప్రభుత్వ బాండ్ల జారీ ద్వారా రుణాలు సేకరించాలని భావిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.
చదవండి: మారిన పాన్ - ఆధార్ కార్డు నిబంధనలు, కొత్త రూల్స్ ఇవే

ఆకర్షణీయంగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు
గ్లోబల్ బాండ్ వల్ల డొమెస్టిక్ గవర్నమెంట్ బాండ్స్ అమౌంట్‌ను తగ్గించదని రఘురాం రాజన్ అన్నారు. ఇండియాలో డిమాండ్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తారని, డిమాండ్ లేకుంటే మనల్ని ముంచుతారని, ఇలాంటిది భారత్‌కు ఆందోళన కలిగించే అంశమన్నారు. అంటే మన మార్కెట్ ఆకర్షణీయంగా ఉన్నప్పుడు పెట్టుబడి పెడతారని, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఉపంహరించుకుంటారని చెప్పారు.

ఇదీ సరైన పద్ధతి..
విదేశీ కరెన్సీ బాండ్స్ కంటే విదేశీ పెట్టుబడిదారులు ఫారన్ పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్టర్లుగా (FPI) నమోదు చేసుకోవడాన్ని సడలించడం మంచిదని రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. FPIలకు రిజిస్ట్రేషన్ నిబంధనలు సడలించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయ కరెన్సీలో జారీ చేసే ప్రభుత్వ బాండ్స్‌లో FPI గరిష్ట పరిమితిని మరింత పెంచాలన్నారు. గ్లోబల్ మార్కెట్లో బాండ్స్ జారీ ద్వారా పరిమితంగా రుణాలు సేకరిస్తే సమస్య ఉండదని, కానీ ద్వారాలు తెరుచుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని పదేపదే బాండ్స్ జారీకి పురికొల్పే ప్రమాదముందన్నారు.

అందుకే బాండ్స్ జారీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.8 శాతానికి కట్టడి చేయాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.7.1 లక్షల కోట్ల రుణాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్ంలో దేశీయ మార్కెట్ కేపిటల్ మార్కెట్ ద్వారా నిధుల సేకరణకు అవకాశాలు సన్నగిల్లడంతో కేంద్రం విదేశాల్లో ప్రభుత్వ బాండ్ల జారీపై నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications