For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 రోజుల నష్టాలకు బ్రేక్ ! ఈ సారి గట్టెక్కించిన హెచ్‌డి‌ఎఫ్‌సి

By Chanakya
|

స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. నిఫ్టీ నిలదొక్కుకుని 11900 వైపు పరుగులు తీసింది. రిలయన్స్, హెచ్ డి ఎఫ్ సి ట్విన్స్ సపోర్ట్‌లో మూడు వారాల గరిష్ట స్థాయికి చేరాయి మార్కెట్ సూచీలు. ఈ రోజు ఉదయం నుంచి ఆఖరి సెషన్ వరకూ 50-60 పాయింట్ల టైట్ రేంజ్‌లో కదలాడిన సూచీలు ఆఖరికి లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా నెల రోజుల గరిష్టానికి చేరింది. చివరకు 292 పాయింట్ల లాభంతో 39686 పాయింట్ల దగ్గర సెన్సెక్స్, 77 పాయింట్ల లాభంతో 11865 దగ్గర నిఫ్టీ ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 267 పాయింట్లు పెరిగి 31372 దగ్గర క్లోజైంది.

రూ.15,000 కోట్ల స్కాం: బాలీవుడ్ నటుడు డినో మోరియాకు సమన్లురూ.15,000 కోట్ల స్కాం: బాలీవుడ్ నటుడు డినో మోరియాకు సమన్లు

మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు రెండూ అర శాతం వరకూ లాభపడ్డాయి. ఇక ఇతర సెక్టోరల్ సూచీల విషయానికి వస్తే.. ఐటీ, మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా మీడియా, ఫార్మా, రియాల్టీ, ఆటో రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

 Sensex ends up 292 points, Nifty closes above 11,850

జీ ఎంటర్‌టైన్మెంట్, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటర్స్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్ షేర్లు టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. బిపిసిఎల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్ప్, కోల్ ఇండియా, హెచ్ సి ఎల్ టెక్ షేర్లు నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి.

ఆయిల్ కంపెనీల్లో ఆందోళన

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఐదు వారాల గరిష్టానికి చేరాయి. దీంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు నీరసబాట పట్టాయి. బిపిసిఎల్, ఐఓసిఎల్ స్టాక్స్ 3-4 శాతం నష్టపోయాయి. హిందుస్తాన్ పెట్రోలియం రెండు శాతం వరకూ కోల్పోయింది.
ఇక సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్‌కు సంబంధించిన ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీల తగ్గింపు, ఈ విభాగంలో కొత్తవాళ్లకు అవకాశం వంటి అంశాలపై పెట్రోలియం శాఖ ఓ డ్రాఫ్టును విడుదల చేసింది. దీంతో ఓఎన్జీసీ, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ స్టాక్స్ నీరసించాయి. 4 శాతం వరకూ పతనమయ్యాయి.

జెట్ ఎయిర్ ఆశలు

అప్పుల్లో కూరుకుపోయి సేవలు నిలిపేసిన జెట్ ఎయిర్ వేస్‌.. ఏతిహాద్ - హిందుజాలపై ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సంస్థలూ బిడ్డింగ్‌కు ఆసక్తి కనబరుస్తున్నారనే వార్తల నేపధ్యంలో జెట్ ఎయిర్ స్టాక్ 5 శాతం లాభపడింది. రూ.71.20 దగ్గర క్లోజైంది.

జూన్ ఆటో సేల్స్ ఎఫెక్ట్

ప్రతీ నెలా సియామ్ విడుదల చేసే ఆటోమొబైల్ వాహనాల అమ్మకాల నేపధ్యంలో ప్రతీ నెలా ఒకటో తేదీన వాహనరంగ షేర్లు ఒత్తిడికి గురవుతాయి. ఈ సారి కూడా మారుతి, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేల్యాండ్ కంపెనీల అమ్మకాలు అంతంతమాత్రంగా ఉండడంతో ఈ షేర్లు పతనమయ్యాయి.
జూన్ నెలలో ఎస్కార్ట్స్‌కు సంబంధించిన ట్రాక్టర్ అమ్మకాలు మెరుగ్గా ఉండడంతో ఈ స్టాక్ లాభపడింది. సుమారు 6 శాతం పెరిగి లాభాల్లో ముగిసింది.

డిహెచ్ఎఫ్ఎల్.. ఏదో ఆశ

దివాన్ హౌసింగ్ సంస్థ ఆర్థిక ఫలితాలు మళ్లీ వేసిన వాయిదా నేపధ్యంలో రుణదాతలంతా సమావేశమయ్యారు. సంస్థ ప్రస్తుత ఆర్థిక స్థితిని అంచనా వేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించబోతున్నారు. దీంతో ఈ స్టాక్ 2 శాతం లాభాలతో రూ.73.60 దగ్గర క్లోజైంది. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి స్టాక్ 5 శాతం వరకూ రికవర్ అయింది.

షుగర్ మరింత స్వీట్

ఈ బడ్జెట్లో చక్కెర రంగానికి సంబంధించి ఏదైనా పాజిటివ్ న్యూస్ రావొచ్చేమో అనే అంచనాల నేపధ్యంలో షుగర్ స్టాక్స్ లాభాల్లో పయనించాయి. ఉగర్ షుగర్స్ 10 శాతం, మవానా షుగర్స్ 5 శాతం వరకూ పెరిగాయి. వీటితో పాటు శక్తి షుగర్స్ 3.5 శాతం, రాణా షుగర్స్ 6 శాతం వరకూ పెరిగాయి.

అదానీ లాంగ్ జంప్

మూతబడిన జీఎంఆర్ చత్తీస్‌ఘడ్, కోర్బా వెస్ట్ సంస్థలను కొనుగోలు చేసేందుకు బోర్డు నుంచి అనుమతి లభించడంతో అదానీ పవర్ స్టాక్ ఎగిరి గంతేసింది. దీంతో ఈ స్టాక్ ఏకంగా 20 శాతం వరకూ పెరిగింది. చివరకు 17.5 శాతం లాభాలతో రూ.60.30 దగ్గర క్లోజైంది.

English summary

2 రోజుల నష్టాలకు బ్రేక్ ! ఈ సారి గట్టెక్కించిన హెచ్‌డి‌ఎఫ్‌సి | Sensex ends up 292 points, Nifty closes above 11,850

The Sensex and Nifty ended on a positive note on Monday, tracking positive cues from global equities amid easing trade tensions between the US and China.
Story first published: Monday, July 1, 2019, 17:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X