భారత్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి: అంగీకరించేది లేదని మోడీకి ట్రంప్ అల్టిమేటం!
ఒసాకా: G20 సమ్మిట్ సందర్భంగా ఒకాసాలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు బేటీ కానున్నారు. ఈ భేటీలో ఇటీవల రెండు దేశాల మధ్య బిజినెస్ వేడి పెంచిన టారిఫ్ అంశం ప్రధానంగా చర్చకు రానందని భావిస్తున్నారు. వీరు శుక్రవారం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కారు.
టారిఫ్ అంగీకరించేది లేదని ట్రంప్
భారత్ కొన్నేళ్లుగా అమెరికా వస్తువులపై భారీగా టారిఫ్ విధిస్తోందని, ఈ అంశంపై తాను భారత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తానని, పెంచిన టారిఫ్ తగ్గించమని అడుగుతానని ట్రంప్ ట్వీట్ చేశాడు. భారత్ మళ్లీ టారిఫ్ పెంచిందని, దీనిని ఆమోదించే ప్రసక్తి లేదని, వీటిని కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందేనని చెప్పారు. భారత్ అధిక టారిఫ్ విధిస్తోందని గతంలోను పలుమార్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు.
మూడ్రోజుల పాటు ఒకాసాలో మోడీ
G20 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇప్పటికే ఒకాసా చేరుకున్నారు. ఆయన పలువురు దేశాధినేతలతో చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తదితరులతో భేటీ కానున్నారు. ప్రధాని ఒకాసాలో మూడు రోజుల పాటు ఉంటున్నారు.

భారత్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి!
భారత్ వస్తువులపై అమెరికా టారిఫ్ పెంచడంతో పాటు జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ఫ్రిఫరెన్స్ హోదాను తొలగించింది. దీంతో భారత్ కూడా స్పందించింది. అమెరికా టారిఫ్‌లకు ప్రతిగా భారత్ ఇటీవల 28 రకాల అమెరికా వస్తువులపై టారిఫ్ పెంచింది. 16వ తేదీనుంచి ట్యాక్స్ వసూలు చేస్తోంది. ఇందులో బాదం, ఆపిల్, పప్పుదినుసులు, వాల్‌నట్ తదితర ఉత్పత్తులు ఉన్నాయి. ట్రంప్‌కు అమెరికాలో బలమైన మద్దతు దారులైన గ్రామీణులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. 2020 ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్పత్తులు పండించేవారు కూడా ఆందోళన చెందుతున్నారు. భారత్‌తో మాట్లాడి తమపై భారం లేకుండా చూడాలని ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications