అమెరికా వస్తువులపై భారత్ సుంకం విధించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినేలా కనిపిస్తున్నాయి. భారత్ అమెరికా మోటార్ సైకిళ్లపై 50శాతం సుంకం విధించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకునేందుకు కూడా అమెరికా సిద్ధపడింది.ఇక రెండు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్యం కంటే 2018లో కాస్త తక్కువగానే జరిగింది. అంటే 21.3 బిలియన్ డాలర్ల మేర బిజినెస్ మాత్రమే జరిగింది. గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య వాణిజ్యం కాస్త మెరుగుపడినప్పటికీ... ఈ సమస్య దీర్ఘకాలంలో పెద్దగా ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక 2017లో కొన్ని మెడికల్ డివైసెస్‌పై భారత్ నిర్ణీత ధర విధించింది. భారత్‌లోని పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్యంగా స్టంట్స్‌ను తక్కువ ధరకే అమ్మాలంటూ క్యాప్ విధించింది. దీంతో అమెరికాలో తయారయ్యే స్టెంట్స్ ధర తగ్గిపోయింది. ఇక్కడే ఆ స్టెంట్స్ తయారీ సంస్థ అబ్బోట్ అండ్ బోస్టన్ సైంటిఫిక్ భారీగా నష్టపోయింది. భారత మెడికల్ డివైస్ మార్కెట్ దాదాపు 5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అయితే నష్టాల బాట పట్టిన అమెరికా సంస్థ భారత్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని భావించినప్పటికీ అది కుదరలేదు. ఇక ఈ-కామర్స్ రంగంలో భారత్ తీసుకువచ్చిన నిబంధనలు కూడా అమెరికా సంస్థలైన వాల్ మార్ట్, అమెజాన్‌లపై భారీ ప్రభావం చూపింది. 2018లో వాల్ మార్ట్ 16బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్ సంస్థను కొనుగోలు చేసింది. ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు ప్రతి ఒక్క అమ్మకదారులకు ఒకే రకమైన విధానం ఉండాలని కొన్ని సంస్థల ఉత్పత్తులు ఒకే ఆన్‌లైన్ మార్కెట్ పై కొనుగోలుకు ఉంచరాదనే నిబంధన తీసుకురావడంతో ఇక్కడ కూడా అెమెరికా సంస్థలకు నష్టం వాటిల్లింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన డేటా లోకలైజేషన్ నిబంధనతో కూడా అమెరికా ఇబ్బంది పడుతోంది. చెల్లింపులకు సంబంధించిన డేటా మొత్తం ఇండియాలోని సిస్టంలపైనే స్టోర్ చేసి ఉంచడంతో అమెరికాకు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక భారత్ విధించిన విధానాలను అమెరికా విమర్శించింది. అమెరికాను వాణిజ్యరంగంలో అంటరానిదేశంగా భారత్ చూస్తోందని అగ్రరాజ్యం మండిపడింది. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జీఎస్‌పీ నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీకారచర్యలో భాగంగా భారత్ అమెరికా ఉత్పత్తులపై సుంకం విధించడం అంటే రాజకీయంగా బాగానే ఉంటుంది కానీ దీర్ఘకాలంలో మాత్రం ఇది పెద్ద దెబ్బే అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications