గత కొన్నాళ్లుగా ఇండియన్ మొబైల్ మార్కెట్‌ను షావోమీ ఊపేస్తోంది. ఈ కంపెనీ నుంచి ఓ ఫోన్ వస్తుందంటే అది హాట్ కేక్. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ K20, K20 Proలను వచ్చే నెలలో భారత్‌కు తీసుకు రానుంది. ఈ ఫోన్లు చైనాలో విడుదలయ్యాయి. ఈ రెండు ఫోన్లను జూలై 15 నుంచి 20 మధ్యన విడుదల చేయనున్నట్లు రెడ్‌మీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ ప్రకటించారు. మరో ఆరు వారాల్లో అంటే జూలై మధ్యలో ఈ ఫోన్లను తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ఈ ఫోన్ల ధర ఎంత, వాటి ఫీచర్లు ఏమిటనేది అంశాలు తెలుసుకుందాం.

K20, K20 Pro ధరలు ఇలా...
భారత మొబైల్ మార్కెట్‌లో రెడ్‌మీదీ ఎక్కువే. అయితే ఇతర బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో K20, K20 Proలను కాస్త తక్కువ ధరలకు తీసుకువచ్చే అవకాశముందని తెలుస్తోంది. చైనా ధరతో పోల్చి చూస్తే K20 Pro ధరలు రూ.25,200 నుంచి రూ.30,000 వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. K20 మోడల్ ధరలు రూ.20వేల నుంచి రూ.26 వేలుగా ఉండే అవకాశముంది. చైనాలో విడుదలైన పేర్లతోనే భారత్‌లోను విడుదల చేయనున్నారు.

K20 Pro ధరలు అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
రెడ్‌మీ K20 Pro ధరలు 6GB+64GB వేరియంట్ చైనాలో 2,499యువాన్లు అంటే మన వద్ద దాదాపు రూ.25,000 వరకు ఉండవచ్చు. 6GB + 128GB వేరియంట్ చైనాలో 2,599 యువాన్లుగా ఉంటే మన వద్ద రూ.26,000 ఉండొచ్చు. 8GB + 128GB వేరియంట్ ధర చైనాలో 2,799గా ఉంది. మన వద్ద దీని ధర రూ.28,000 వరకు ఉండవచ్చు. 8GB + 256GB వేరియండ్ చైనాలో 2,999 యువాన్లుగా ఉంది. మన వద్ద రూ.30,000 వరకు ఉండొచ్చు.

K20 ధరలు అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
రెడ్‌మి K20 ధరలు ఇలా ఉండే అవకాశముంది. 6GB + 64GB వేరియంట్ చైనాలో 1,999 యువాన్లుగా ఉంది. ఇది భారత్‌లో రూ.20,000 వరకు ఉండవచ్చు. 6GB + 128GB వేరియంట్ చైనాలో 2,099గా ఉంది. ఇది మన వద్ద రూ.21,000 వరకు ఉండొచ్చు. 8GB + 256GB వేరియంట్ చైనాలో 2,599గా ఉంది. ఇది మన వద్ద రూ.26,000 వరకు ఉండవచ్చు.

K20, K20 Pro ఫీచర్లు
రెడ్‌మీ K20 ఫీచర్లు... 6.39 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 48+8+13 ఎంపీ బ్యాక్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, OS ఆండ్రాయిడ్ పై.
రెడ్‌మీ K20 Pro ఫీచర్లు... 6.39 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 48+8+13 ఎంపీ బ్యాక్ కెమెరా,
రిజల్యూషన్ 1080x2340 పిక్సెల్స్, RAM 6GB, 64GB స్టోరేజీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, OS ఆండ్రాయిడ్ పై. ఈ రెండు ఫోన్లు పాపప్ కెమెరాతో పాటు అండర్ డిస్‌ప్లే కెమెరాతో వస్తున్నాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

ఇరాన్ యుధ్దం వేళ చైనా కీలక నిర్ణయం..ఆసియా దేశాలకు భారీ ఊరట..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications