తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం బంపరాఫర్ ప్రకటించింది. డీఏ (Dearness Allowances) పెంచుతున్నట్లు చెప్పి తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచింది. దీంతో ఇప్పటి వరకు 27.248 శాతంగా ఉన్న డీఏ ఇక నుంచి 30.392 శాతానికి పెరిగింది. శనివారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెరిగిన డీఏ 1 జూలై 2018 నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన అమౌంట్ జూన్ నెల వేతనంతో కలిసి ఖాతాల్లో జమకానుంది.

కొత్త డీఏ వీరికే
2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహెచ్ సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి ఈ కొత్త డీఏ వర్తించనుంది.

డీఏ బకాయిల చెల్లింపు ఇలా
1 జూలై 2018 నుంచి 31 మే 2019 నాటికి డీఏ బకాయిల్ని ఉద్యోగుల జీపీఏ అకౌంట్‌లో ప్రభుత్వం జమ చేస్తుంది. 30 సెప్టెంబర్ 2019కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిల్ని ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది. 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు, 1 జూలై 2018 నుంచి 31 మే 2019 కాలానికి సంబంధించి పెరిగిన డీఏ బకాయీల్లో పది శాతాన్ని వారి ప్రాణ్ (పీఆర్‌ఏఎన్) ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన తొంబై శాతం డీఏ బకాయిల్ని జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్‌కు అనర్హులైన ఫుల్‌టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లిస్తుంది.

రిటైర్డ్ ఉద్యోగులకు...
రిటైర్డ్ ఉద్యోగులు జూలై నెలలో అందుకునే జూన్ నెల పింఛన్ మొదలుకొని డీఆర్ పెంపు కనిపిస్తుంది. వారికి జూలై 2018 నుంచి మే 2019 వరకు అందాల్సిన డీఆర్ బకాయిలన్నీ వారు ఆగస్ట్ 1వ తేదీన అందుకునే జూలై పింఛనుతో సహా నగదుగా చేతికి వస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications