అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకిచ్చారు. భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 5, 2019 నుంచి ట్రేడ్ ప్రిఫరెన్స్ ప్రోగ్రాం రద్దు చేసుకుంటున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. అమెరికా ఈ ఒప్పందం రద్దు చేయడంతో జీఎస్‌పీ ప్రోగ్రాంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లబ్ధిదారుగా ఉన్న భారత్ ఆ అర్హత కోల్పోనుంది. జీఎస్‌పీ ప్రోగ్రాం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ దేశాల్లో తయారవుతున్న ఉత్పత్తులను ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది.
భారత మార్కెట్లు అంత అనుకూలంగా లేవని భావించిన డొనాల్డ్ ట్రంప్ జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్(జీఎస్‌పీ) నుంచి భారత్‌ను తొలగించాలని ఈ ఏడాది మార్చిలో భావించారు. ఇక ట్రంప్ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత్‌ను జీఎస్‌పీ నుంచి తొలగించేందుకు డిసైడ్ అయ్యారని ఓ సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే అమెరికా ఉత్పత్తులకు భారత్ సరైన మార్కెట్ కల్పించగలిగితే ఈ ఒప్పందాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

డేటా లోకలైజేషన్, ఈ - కామర్స్ రంగంలో భారత్ సరైన విధానాలు రూపొందిస్తే అంటే భారత్‌లోని టాప్ కంపెనీల్లో అంతర్జాతీయంగా పెట్టుబడులకు అనుమతిస్తే భారత్‌తో కలిసి వాణిజ్యరంగంలో ముందుకెళ్లేందుకు అమెరికా సహకరిస్తుందని వైట్ హౌజ్ సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు. ఇక జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్స్ పద్ధతిలో భారత్ అన్ని దేశాలకంటే అత్యధిక లబ్ధిదారుగా ఉంది. ఇందులో భాగంగా భారత్‌కు దాదాపుగా 5.6 బిలియన్ డాలర్లు సుంకం లేకుండా అంటే ఇంత పెద్ద మొత్తంలో రాయితీని ఇచ్చే సదుపాయాన్ని అమెరికా కల్పించింది. ఇదిలా ఉంటే ట్రంప్ భారత్‌ను జీఎస్‌పీ నుంచి తొలగిస్తే భారత్‌లో 20 అమెరికా వస్తువులపై అధిక పన్నులు విధించాలని భావిస్తోంది. మరోవైపు జీఎప్పీ తొలగింపు వల్ల భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications