రిలయన్స్ జియో వచ్చి మిగతా టెలికం ప్రొవైడర్స్‌కు గట్టి షాకిచ్చాయి. జియో దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి సంస్థలు తమ కస్టమర్లను కోల్పోతున్నాయి. జియో డేటా, కాల్స్ ఇతర సదుపాయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇతర టెలికం సంస్థలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనే అంశంపై దృష్టి సారించారు. తాజాగా, వొడాఫోన్.. సిటీబ్యాంక్ భాగస్వామ్యంతో సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ ప్రకటించింది. తద్వారా జియోకు ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేసింది. ఇది కేవలం వొడాఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్
వొడాఫోన్ వెబ్‌సైట్ ద్వారా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రయోజనం ఉంటుంది. ఇదివరకే వోడాఫోన్ యూజర్ అయి ఉండాలి. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ ప్యాకేజీలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత ఫోన్ కాల్స్ ప్రయోజనం ఉంది. దీని వ్యాలిడిటీ ఏడాది. అయితే ఈ ఆఫర్ కొన్ని సర్కిళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో హైదరాబాద్ సర్కిల్ ఉంది.

ఈ ఆఫర్ కోసం షరతులు
ఫస్ట్‌టైమ్ వోడాఫోన్ కస్టమర్లలకు ఈ ఆఫర్ వర్తించదు. ఇది కేవలం ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు మాత్రమే ఉంది. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరో కండిషన్ కూడా ఉంది. మీ చేతిలోకి క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత మొదటి నెలలో రూ.4,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన నెల రోజుల్లో ఈ మొత్తం ఖర్చు చేయాలి. అయితే ఈ రూ.4వేలు ఒకేసారి ఖర్చు చేస్తారా లేక విడివిడిగా ఖర్చు చేస్తారా మీ ఇష్టం. కానీ నెలలో ఆ మొత్తం స్పెంట్ చేయాలి. అలాగే, ఈ ఖర్చు కూడా వోడాఫోన్ లేదా ఐడియా వెబ్‌సైట్ ద్వారానే ఖర్చు చేయాలనే తప్పనిసరి ఏమీ లేదు. ఎక్కడైనా ఖర్చు చేయవచ్చు.

బెనిఫిట్స్
క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ మొత్తం ఖర్చు చేసిన అనంతరం ఆటోమేటిక్‌గా మీరు వొడాఫోన్ ఆఫర్‌కు ఎలిజిబుల్ అవుతారు. ఇందుకు సంబంధించిన బెనిఫిట్స్ 45 రోజుల్లో మీ వొడాఫోన్‌కు క్రెడిట్ అవుతాయి. ఆ తర్వాత మీకు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపించుకునే వెసులుబాటు ఒక సంవత్సరం (365) రోజులు ఉంటుంది.

ఈ ఆఫర్ ఎక్కడెక్కడ ఉంది?
ఈ ఆఫర్‌ను పరిమిత సర్కిళ్లకు మాత్రమే వర్తింపచేశారు. ఇందులో ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు, వడోదర, చండీగఢ్, సికింద్రాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణే నగరాల్లో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని సర్కిల్స్‌లో ఈ ఆఫర్‌ను విస్తరిస్తారా లేదా తెలియాల్సి ఉంది. వోడాఫోన్ వెబ్‌సైట్ ప్రకారం ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు ఉంది. ఈ ఆఫర్ కోసం మరిన్ని అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అందుకు మీరు వోడాఫోన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడండి.


Click it and Unblock the Notifications