పాలసీలు ఏమిటో?: వచ్చే ప్రభుత్వం పాలసీ కోసం అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్ వెయిటింగ్!
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు భారత్‌లో తమ తమ పెట్టుబడుల ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు కొత్త ప్రభుత్వం కోసం వేచి చూస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి పెద్ద పెద్ద సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు రానున్న ప్రభుత్వంలోని డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీలను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ప్రభుత్వంలో ఆయా మంత్రిత్వ శాఖలను కలిసి వారి పాలసీ స్టాండ్‌ను తెలుసుకోనున్నారు.
ఈ-కామర్స్ డేటా ప్రొటక్షన్, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలపై ప్రభుత్వం స్టాండ్ తెలుసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు డేటా ప్రొటక్షన్ చట్టాలపై దృష్టి సారించాయి. డేటా రక్షణ చట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.

కొత్త ప్రభుత్వం పాలసీలు ఏమిటి, ముందు ఎలా ఉన్నప్పటికీ చివరకు వచ్చేసరికి అలా ఉండకపోవచ్చునని, కాబట్టి కొత్తగా వచ్చే ప్రభుత్వం పాలసీలు తెలియాలని అంటున్నారు.
టెక్నాలజీ కంపెనీలు, లా ఫర్మ్స్, ఇండస్ట్రీ అసిసోయేషన్స్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయని, డేటా ఫ్లో, ఫారన్ ఇ


Click it and Unblock the Notifications