చైనీస్ టెక్ దిగ్గజం జియోమీ 'ఎంఐ ఎక్స్‌ప్రెస్ కియోస్క్స్' పేరుతో కొత్త వ్యవస్థను తీసుకు వస్తోంది. ఈ మేరకు సోమవారం నాడు ప్రకటన చేసింది. భారత్‌లో దీనిని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వెండింగ్ మిషన్ తరహా పని చేస్తుంది. వినియోగదారులు, Mi అభిమానులు జియోమీ స్మార్ట్ ఫోన్స్‌ను, మొబైల్ యాక్సెసరీస్‌ను డైరెక్ట్‌గా 'ఎంఐ ఎక్స్‌ప్రెస్ కియోస్క్స్' ద్వారా కొనుగోలు చేయవచ్చు.
జియోమీ గ్లోబల్ వీపీ మను కుమార్ జైన్ ఈ మేరకు బెంగళూరులో తొలి టెక్ పార్క్‌ను ప్రారంభించాడు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లలో వెండింగ్ మిషన్లలో డబ్బులు వేయగానే ఆ నగదుకు సమానమైన వస్తువు బయటకు వస్తుంది. ఇదే తరహా ఇప్పుడి ఎంఐ మొబైల్స్ కొనుగోలు చేయవచ్చు.

దేశంలోని ముఖ్య నగరాల్లో వెండింగ్ మిషన్ యూనిట్లను ఏర్పాటు చేసి స్మార్ట్ ఫోన్, మొబైల్ యాక్సెసరీస్‌ను విక్రయించనుంది. స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లో ఈ కంపెనీ ఆధిపత్యం కొనసాగుతోంది. దీనిని ఇలాగే కొనసాగించేందుకు, మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది.
'ఎంఐ ఎక్స్‌ప్రెస్ కియోస్క్స్'ను అన్ని పేమెంట్స్ కార్డ్స్‌కు అనుకూలంగా తయారు చేశారు. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్యాష్, యూపీఐ.. ఇలా అన్ని రకాల పేమెంట్స్‌కు అనుకూలంగా ఉండనుంది. అక్కడి టచ్ స్క్రీన్ వెండింగ్ మిషన్‌తో ఇంటరాక్ట్ కావడానికి, డివైస్ సెలక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
200 స్మార్ట్‌ఫోన్లు నిల్వ చేసుకునే సామర్థ్యంతో ఈ వెండింగ్ మెషిన్లను రూపొందించారు. ముఖ్య నగరాలతో పాటు రద్దీగా ఉండే విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications