For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే మరిన్ని లాభాలు: స్థానిక భాషల్లో సేవలందించే యోచనలో ఈ-కామర్స్ వెబ్‌సైట్లు

|

ముంబై: ఈ మధ్యకాలంలో ఈ - కామర్స్ వెబ్‌సైట్స్ ఎక్కువైపోయాయి. వినియోగదారుడికి ఏ వస్తువు కావాలన్న ఇకపై షోరూంకు వెళ్లి కొనాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు వచ్చి సులభతరం చేశాయి. ఇప్పుడు వినియోగదారులను మరింత అట్రాక్ట్ చేసి తమ సేల్స్‌ను పెంచుకునేందుకు ఆయా స్థానిక భాషల్లో తమ వెబ్‌సైట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తద్వారా తమ వినియోగదారుల సంఖ్యను మరో 100 మిలియన్‌కు పెంచుకునే యోచనలో ఉన్నాయి.

 స్థానిక భాషల్లో ఈకామర్స్ వెబ్‌సైట్లు యాప్‌లు

స్థానిక భాషల్లో ఈకామర్స్ వెబ్‌సైట్లు యాప్‌లు

ఇప్పటి వరకు ఇంగ్లీషు మాట్లాడి అర్థం చేసుకునే వారినే ఈ కామర్స్ సైట్స్ దృష్టి సారించాయి. అంటే దాదాపు 130 మిలియన్ మంది ఇంగ్లీషు మాట్లాడగలిగే వారినే లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే 400 మిలియన్ మంది ఇంటర్నెట్ వినియోగదారులుంటే అందులో 90 మిలియన్ మందిని మాత్రమే అట్రాక్ట్ చేయగలిగాయి ఈకామర్స్ సైట్లు. ఇక వీరినే కాకుండా ఆయా దేశాల్లో స్థానిక భాషలను కూడా తమ సైట్లపై ప్రవేశపెట్టి మరో 100 మిలియన్ వినియోగదారులపై కన్నేశాయి. ఇప్పటికే ఈకామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు తమ సైట్లను స్థానిక భాషల్లో కూడా అందిస్తున్నాయి.అమెజాన్ పత్ని గ్రూప్ సంస్థలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఫ్రాంటిజో బిజినెస్ సర్వీసెస్ ఈ రెండు సంస్థలకున్న వినియోగాదరులకు తమ సేవలను స్థానికి భాషల్లో అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థను టేకోవర్ చేసిన ఫ్లిప్ కార్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థను టేకోవర్ చేసిన ఫ్లిప్ కార్ట్

ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇప్పటికే లివ్.ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థను టేకోవర్ చేసింది. ఈ సంస్థ స్పీచ్‌ టూ టెక్ట్స్ ద్వారా దాదాపు 10 భారతీయ భాషలను అనువదిస్తుంది. ఇందులో హిందీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తెలుగు, తమిళం, మళయాలం లాంటి భాషల్లో వినియోగదారుడికి అర్థమయ్యేలా సేల్స్ గురించి వివరిస్తాయి. స్థానిక భాషల్లో సేవలందించడం ద్వారా మంచి ఫలితాలను పొందిన ఇతర డిజిటల్ ప్లాట్‌ఫాంల అడుగుజాడలనే దిగ్గజ ఈకామర్స్ వెబ్‌సైట్లు ఫాలో అవుతున్నాయి. ఓలా కూడా వివిధ భాషల్లో తమ యాప్‌ను తీసుకురావడం వల్ల 10 మిలియన్ వినియోగదారులను సంపాదించుకుంది.

స్థానిక భాషలతో లాభాల వైపు పయనించిన సంస్థలు

స్థానిక భాషలతో లాభాల వైపు పయనించిన సంస్థలు

ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎంకు 40 మిలియన్ వినియోగదారులుండగా అందులో 25శాతం మంది స్థానిక భాషల్లో మాట్లాడే వారు ఉండటం విశేషం. ఇక ప్రముఖ న్యూస్ యాప్ డెయిలీ హంట్ తన కంటెంట్‌ను 14 భారతీయ భాషల్లో అందిస్తోంది. దీనికి దాదాపు 200 మిలియన్ మంది వినియోగదారులున్నారు. మరో మ్యూజిక్ యాప్ సావన్‌ 10 భాషల్లో దాని కంటెంట్‌ను అందిస్తోంది. ఇందులో 60శాతం హిందీ వినియోగదారులు న్నారు. విద్యార్థుల కోసం వచ్చిన డౌట్‌నట్ అనే యాప్ 12 భాషల్లో ఉంది. చిన్న నగరాల్లోని విద్యార్థులే లక్ష్యంగా ఈ యాప్ తీసుకురావడం జరిగింది. అతి తక్కువ సమయంలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.

English summary

ఇలా చేస్తే మరిన్ని లాభాలు: స్థానిక భాషల్లో సేవలందించే యోచనలో ఈ-కామర్స్ వెబ్‌సైట్లు | E-commerce companies eye on the use of local languages in their services

The success of some consumer internet segments in making inroads into the vernacular user base has given a new vigour to the e-commerce biggies. The vernacular focus is expected to widen their user base by another 100 million.
Story first published: Monday, May 13, 2019, 10:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X