అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారత్ మన వస్తువులపై ఎక్కువ టారిఫ్ వేస్తోందని గతంలో పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ తాజాగా పేపర్ ఇంపోర్ట్ టారిఫ్ అంశం గురించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదివరకు హార్లీ డేవిడ్‌సన్‍పై వంద శాతం టారిఫ్ వేస్తోందని ఆరోపించాడు. భారత్‌ను టారిఫ్ కింగ్ అని అభివర్ణించాడు.
భారత్ పేపర్, పేపర్ ప్రాడక్ట్స్ పైన ఎక్కువ ఇంపోర్ట్ టారిఫ్ వేస్తోందని ట్రంప్ ధ్వజమెత్తాడు. ఫారన్ పేపర్ పైన తాము ఇతర దేశాలకు టారీఫ్ ఏమీ విధించడం లేదని పేర్కొన్నాడు. కానీ విస్కిన్‌సిన్ కంపెనీలు ఎక్స్‌పోర్ట్ చేసే ఉత్పత్తులపై చైనా భారీగా టారిఫ్ విధిస్తోందని, భారత్ కూడా ఎక్కువ టారిఫ్ వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. వియత్నాం అలాగే వసూలు చేస్తోందని చెప్పాడు. ఇలా పెద్ద ఎత్తున టారిఫ్ వసూలు చేయడం ఫెయిర్ కాదని పేర్కొన్నాడు.

భారత్, చైనా, జపాన్ దేశాల వల్ల దశాబ్దాలుగా మనం లక్షల డాలర్లను కోల్పోతున్నామని, దేశం ఏది అయినా చివరకు నష్టపోవాల్సి వస్తోందని అన్నాడు. ఇప్పటి వరకు పొగొట్టుకున్నది చాలునని, ఇక మీదట అలా జరగకుండా జాగ్రత్తపడదామన్నాడు..
పల్ప్ వుడ్, పేపర్ బోర్డు, ప్రింటెడ్ బుక్స్, న్యూస్ ప్రింట్ తదితర వాటిని అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2018 క్యాలెండర్ ఇయర్‌లో ఇవి 10.8 బిలియన్ డాలర్ల విలువ కలిగిన మొత్తం దిగుమతి చేసుకుంది. 2018లో భారత్ ఎగుమతులు 12 శాతం పెరిగింది. 51.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో దిగుమతులు 37.5 శాతం పెరిగాయి. ఇది 34.1 బిలియన్లు పెరిగింది.


Click it and Unblock the Notifications