కమ్యూనిస్ట్ దిగ్గజం దెబ్బ: చైనా నుంచి భారత్‌కు 200 అమెరికా కంపెనీలు, ఆ తర్వాతే...

దాదాపు 200 అమెరికాకు చెందిన కంపెనీలు చైనా నుంచి భారత్ వచ్చేందుకు సిద్ధమవుతున్నాయట. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. డ్రాగన్ కంట్రీ నుంచి తయారీ కేంద్రాలను ఇక్కడకు బదలీ చేయనున్నారు. చైనా పైన అమెరికకు చెందిన కంపెనీలకు విశ్వాసం సన్నగిల్లడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ మొదలైనప్పటి నుంచే ఈ కంపెనీలు అభద్రతలో ఉన్నాయట. కమ్యూనిస్ట్ దిగ్గజ దేశానికి ప్రత్యామ్నాయంగా భారత్‌లో అద్భుతమైన అవకాశాలు ఉన్నట్లు అమెరికా కంపెనీలు గుర్తించాయని అంటున్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ అనే పేరు వినిపిస్తోందట. దాదాపు 200కు పైగా అమెరికా కంపెనీలు తమ తయారీ కేంద్రాల (బేస్)ను చైనా నుంచి భారత్‌కు తరలించాలని యోచిస్తున్నాయని తెలుస్తోంది.

 భారత్‌కు అమెరికా కంపెనీలు

భారత్‌కు అమెరికా కంపెనీలు

ఆయా కంపెనీ వర్గాలు యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫోరం అధ్యక్షులు ముకేశ్‌ ఆఘి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరముందన్నారు. అలాగే నిర్ణయాత్మక ప్రక్రియల్లో మరింత పారదర్శకత తీసుకురావాలని చెప్పారు. గత ఏడాది కాలంగా అమెరికా కంపెనీల నిర్ణయాలు చూస్తున్నామని, డేటా లోకలైజేషన్‌, ఈ-కామర్స్‌ లాంటి అంశాల్లో స్థానికతకు పెద్దపీట వేసే యోచనలో ఉన్నారని, వారిని ఎలా ఆకర్షించాలనే దానిపై దృష్టిసారించాలని, అందుకు తగినట్లుగా భూసేకరణ, పన్నువిధానం వంటి అంశాల్లో సంస్కరణలు అవసరమని, వాటిని వేగవంతం చేయాలని, దీంతో ఎక్కువ ఉద్యోగాల సృష్టికి అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

భారత్‌కు ప్రయోజనకరం

భారత్‌కు ప్రయోజనకరం

దీంతో ఎన్నో లాభాలు ఉంటాయనికి ముఖేష్ అన్నారు. అమెరికా - భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని, చైనా నుంచి దిగుమతయ్యే చౌక ధర వస్తువుల ఆందోళన వంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, దీంతో పాటు ఆమెరికా జీఎస్పీ (ప్రధాన్య వాణిజ్య హోదా) సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయన్నారు. అమెరికా వస్తువులు భారత్ మార్కెట్లో విక్రయించేందుకు, భారత వస్తువులు అమెరికాలో విక్రయించేందుకు మంచి అనుసంధానం ఏర్పడుతుందన్నారు. యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌‌లో సభ్యులుగా ఉన్న కంపెనీలు గ నాలుగేళ్లలో 5వేల కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయన్నారు.

వ్యాపారప్రయోజనాలపై దెబ్బ

వ్యాపారప్రయోజనాలపై దెబ్బ

అమెరికా-చైనా మధ్య ఘర్షణ వాతావరణం తమ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని, దీనివల్ల తాము నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని అమెరికా సంస్థలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. చైనాతో అమెరికా వాణిజ్య లోటు భారీగా ఉన్నందున ఆ దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోరుకు తెరతీశారు. దీంతో చైనా కూడా ప్రతీకార సుంకాలకు దిగుతోంది. ఫలితంగా రెండు దేశాల సంస్థలు, వాటి ఉత్పత్తులు ప్రభావితం అవుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+