సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి గుడ్‌న్యూస్! మార్చి నెలలో నిరుద్యోగం శాతం తగ్గింది. ప్రస్తుత ఎన్నికల్లో విపక్షాల ప్రధాన ఆయుధాల్లో నిరుద్యోగం కూడా ఒకటి. కానీ తాజా నివేదిక ఒకటి బీజేపీకి ఊరటనిచ్చేదిలా ఉంది. అంతకుముందు నిరుద్యోగం శాతం 7గా ఉంది. కానీ 2019 మార్చి నాటికి ఇది 6.7 శాతంగా నమోదయింది. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది.

తగ్గిన నిరుద్యోగం
2018 నవంబర్ నెలలో నిరుద్యోగత 6.7 శాతంగా ఉండగా, డిసెంబర్ నెలలో అది 7 శాతానికి పెరిగింది. 2019 జనవరిలో 7.1 శాతం, ఫిబ్రవరిలో 7.2 శాతంగా నమోదయింది. కానీ మార్చి నెలలో మాత్రం అనూహ్యంగా తగ్గి 6.7 శాతానికి వచ్చింది. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కోనున్న అతిపెద్ద అంశం నిరుద్యోగం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇటీవల చెప్పారు. కానీ ఇప్పుడు నిరుద్యోగ శాతం తగ్గడం గమనార్హం.

నిరుద్యోగం డేటా ఎలా ఉందంటే
అదే సమయంలో లేబర్ ఫోర్స్ 2019 ఫిబ్రవరిలో 42.7 శాతం ఉండగా, 2019 మార్చి నాటికి 42.6 శాతానికి తగ్గింది. 2019 జనవరిలో 435 మిలియన్లు ఉండగా, ఫిబ్రవరిలో 431 మిలియన్లు, మార్చి నాటికి 430 మిలియన్లకు తగ్గింది. లేబర్ ఫోర్స్ ఒక మిలియన్ తగ్గిన కారణంగా, నిరుద్యోగత 2019 ఫిబ్రవరిలో 400 మిలియన్లు ఉండగా, మార్చి నాటికి 401కి పెరిగిందని సీఎంఐఈ ఎండీ అండ్ సీఈవో వ్యాస్ తెలిపారు.

గ్రామీణ భారతంలో పెరుగుతున్న ఉద్యోగాలు
గ్రామీణ భారతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 271 మిలియన్లు కాగా, మార్చి నెలలో 275గా ఉంది. అంటే గ్రామీణ భారతంలో నిరుద్యోగం తగ్గి, ఉద్యోగాలు పెరిగాయి. పట్టణ భారతంలో మాత్రం ఉద్యోగాలు కొన్ని తగ్గాయి. ఫిబ్రవరిలో 129 మిలియన్ ఉద్యోగాలు ఉండగా, మార్చి నాటికి 127 మిలియన్ ఉద్యోగాలు ఉన్నాయి. గ్రామీణ భారతంలో ఉద్యోగాలు ఎక్కువగా పెరుగుతున్నాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications