For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్నికలు: ఓటరు స్లిప్ ఎలా తీసుకోవాలి, ఇది ఉంటే సరిపోతుందా? ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

|

నేడు (ఏప్రిల్ 11) సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తొలి ఫేజ్ పోలింగ్ జరుగుతోంది. ఓటరు స్లిప్‌తో ఓటు వేయవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. స్లిప్ ఉంటే ఓటు వేయవచ్చునని భావిస్తారు. కానీ అది పొరపాటు. ఓటరు స్లిప్ మాత్రమే ఉంటే ఓటు వేయడం కుదరదు. దీంతో పాటు ఏదైనా ఒక ధ్రువపత్రము పోలింగ్ అధికారికి చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఓటు వేయడానికి అనుమతించరు.

రైల్వే ప్రయాణీకులకు 'సమ్మర్' రిలీఫ్రైల్వే ప్రయాణీకులకు 'సమ్మర్' రిలీఫ్

ఓటరు స్లిప్ ఉంటే సరిపోదు, ఈ 11 వాటిల్లో ఒకటి ఉండాలి

ఓటరు స్లిప్ ఉంటే సరిపోదు, ఈ 11 వాటిల్లో ఒకటి ఉండాలి

ఓటరు స్లిప్‌తో పాటు ఈ 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఉన్నా ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది. 1.ఆధార్ కార్డు

2.ఎపిక్ కార్డు

3.పాస్‌పోర్ట్

4.డ్రైవింగ్ లైసెన్స్

5.సర్వీస్ గుర్తింపు కార్డు

6.బ్యాంకులు / పోస్ట్ ఆఫీస్ వారు జారీ చేసిన పాస్ పుస్తకము

7.ఆదాయ పన్ను గుర్తింపు కార్డు

8.స్మార్ట్ కార్డులు

9.MNREGA క్రింద జారీచేసిన ఫోటోతో కూడిన జాబ్ కార్డు

10.ఆరోగ్య బీమా పథకం కార్డు

11.ఫోటో కలిగిన పెన్షన్ పత్రాలు

12.ఎంపీ / ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీచేసినటువంటి ఫోటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు.

ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఓటు వేయడానికి ముందు ఓటరు స్లిప్‌లు ఇస్తారు. ఆయా పార్టీలకు చెందినవారు, అధికారులు, ఓటు వేసే ముందు కాస్త దూరంలో కూడా ఇస్తుంటారు. అయితే ఈ స్లిప్‌లను మీరు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందా చెక్ చేసుకొని, స్లిప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఓటరు లిస్టులో మీ పేరు లేకుంటే ఓటు వేయనీయరు. nvsp.in ద్వారా జాబితాలో మీ పేరు ఉందా చెక్ చేసుకొని, ఓటరు స్లిప్ ఫోటో కాపీ డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఓటరు స్లిప్‌తో పాటు ఓటరు ఐడెంటిఫికేషన్ కార్డు కూడా తీసుకు వెళ్లాలి.

ఓటరు స్లిప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ఓటరు స్లిప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ఓటరు స్లిప్‌ను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి. తొలుత nvsp.in వెబ్ సైట్‌లోకి వెళ్లండి. Search Your Name in Electoral Roll అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ ఆధారాలను ఫిల్ చేయండి. ఆ తర్వాత search బటన్ పైన క్లిక్ చేయండి. మీ పేరు పేజీ కింద కనిపిస్తుంది. ఆ తర్వాత view details పైన క్లిక్ చేయండి. మీ ఓటరు స్లిప్ కనిపిస్తుంది. మీ ఓటరు స్లిప్ కింద ఉన్న Print Voter Information పైన క్లిక్ చేయండి. ప్రింట్ తీసుకోండి. ఒకవేళ మూడు స్టెప్స్ తర్వాత మీ పేరు కనిపించకుంటే 2019 లోకసభ ఎన్నికల్లో మీరు ఓటు వేయలేకపోవచ్చు. ఎందుకంటే జాబితాలో మీ పేరు లేకపోవచ్చు.

ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు

ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు

మీరు ఓటు వేయడానికి ఎలక్షన్ బూత్‌కు వెళ్లినప్పుడు ఓటరు లిస్టులో మీ పేరు, ఓటు లేకుంటే మీ ఆధార్ కార్టు, ఓటరు గుర్తింపు కార్డు చూపించి సెక్షన్ 49ఏ కింద ఛాలెంజ్ ఓటు అడిగి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మీరు వెళ్లేటప్పటికే మీ ఓటు ఇతరులు వేసి ఉంటే టెండర్ ఓటు అడిగి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 14 శాతం దాటి టెండర్ ఓట్లు పోలయిన బూత్‌లో మరలా పోలింగ్ జరగాలి. ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలి.

English summary

ఎన్నికలు: ఓటరు స్లిప్ ఎలా తీసుకోవాలి, ఇది ఉంటే సరిపోతుందా? ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి | Voter Slip Not Enough: List of 11 ID Documents Approved by ECI For Voters Ahead of Lok Sabha Elections 2019

With the Lok Sabha elections about to knock the doors, the Election Commission in an attempt to maximise participation on the voters have given a green signal to 11 more documents, apart from Electors Photo Identity Card (EPIC), informed the EC on Thursday.
Story first published: Thursday, April 11, 2019, 5:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X