భారత ఐటీ పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఐటీ పరిశ్రమ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరంలో క్షీణించింది. టెక్ కంపెనీల ఆదాయం మార్చి త్రైమాసికంలో మందగించడంతో పాటు లాభం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీలు తమ ఆధాయాల్లో కోత విధించే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దేశంలోని అగ్ర టెక్ కంపెనీల మార్చి త్రైమాసిక లాభాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని బ్రోకరేజీ సంస్థల సరాసరి అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఆగస్ట్ 2018న యాక్సెంచర్ తన వృద్ధి రేటును 11 శాతంగా చూపించింది. కానీ ఈ ఏడాది మొదటి, రెండో క్వార్టర్‌లో 9.5శాతం, 9శాతానికి పడిపోయింది. దీని ఆధారంగా మూడు, నాలుగో క్వార్టర్‌లో 8.5 శాతం, 7 శాతంగా ఉండవచ్చునని అంచనా.
ఐటీ పరిశ్రమలోని ఐదు టాప్ కంపెనీల లాభదాయకత 4 శాతం వరకు తక్కువగా నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు. మంచి విక్రయాలు ఉన్నప్పటికీ డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ బలపడటం, అమెరికాలో కార్యకలాపాల వ్యయం పెరగడం, కంపెనీల నిర్వహణ వంటి అంశాల ప్రభావం లాభాలపై పడుతుందట.

టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహింద్రా, విప్రో సంస్థల విక్రయాలు ఒకటి నుంచి రెండు శాతం పెరిగినప్పటికీ లాభశాతం మాత్రం వంద బేసిక్ పాయింట్ల వరకు తగ్గవచ్చునని చెబుతున్నారు. వీటితో పాటు మైండ్ ట్రీ, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, హెక్సావేర్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టం వంటి విక్రయాలు జనవరి - మార్చి త్రైమాసికంలో ఒక శాతం పెరగవచ్చునని అంచనా. కానీ అమెరికాలో కార్యకలాపాలకు అధిక వ్యయం అవుతోంది. దీని వల్ల లాభధాయకత తగ్గుతోంది.
జనవరి - మార్చి మధ్య డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ బలపడుతూ వచ్చింది. ఐటీ కంపెనీల నిర్వహణ లాభాలను ఇది కూడా దెబ్బతీసిందని చెబుతున్నారు. విక్రయాలు పెరిగేందుకు కూడా దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం మన టెక్ కంపెనీలు ఎక్కువగా డిజిటల్ సేవలు అందించే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కాగ్నిజెంట్ కంపెనీ గత ఫిబ్రవరితో ముగిసిన త్రైమాసికంలో దక్కించుకున్న కొత్త ఒప్పందాల్లో ఎక్కువ డిజిటల్, క్లౌడ్, సెక్యూరిటీ సేవలకు సంబంధించినవే.


Click it and Unblock the Notifications