For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండిషన్స్ అప్లై: ఎన్నికల రోజు ఓటేసి సిరా చుక్క చూపిస్తే పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్!

|

కొన్ని ప్రాంతాల్లో ఫ్యూయల్ రిటైలర్స్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటే పెట్రోల్, డీజిల్ పైన డిస్కౌంట్ ఇస్తున్నారు. అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ సౌకర్యం లభించదు. కొన్ని రిటైలర్ కంపెనీలు మాత్రమే ఆఫర్లు ఇస్తున్నాయి. పోలింగ్ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

<strong>ఎన్నికలకు ముందు రేపో రేట్ కట్, ఎకానమీకి బీజేపీ గెలుపు అవసరం!</strong>ఎన్నికలకు ముందు రేపో రేట్ కట్, ఎకానమీకి బీజేపీ గెలుపు అవసరం!

లీటర్ పెట్రోల్ పైన ఎంత డిస్కౌంట్ అంటే?

లీటర్ పెట్రోల్ పైన ఎంత డిస్కౌంట్ అంటే?

లీటరు పెట్రోల్, డీజిల్ రేట్లపై 50 పైసలు డిస్కౌంట్ ఇస్తారు. మీరు ఎన్ని లీటర్లు తీసుకుంటే అన్ని లీటర్లకు.. ఒక్కో లీటరుకు రూ.50 పైసల చొప్పున డిస్కౌంట్ ఉంటుంది. ఓటు వేసినట్లుగా సిరా చుక్క చూపిస్తే ఈ డిస్కౌంట్ ఇస్తారు. ఈ మేరకు గత శుక్రవారం ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ వెల్లడించారు.

పోలింగ్ విజయవంతం కోసం

పోలింగ్ విజయవంతం కోసం

ప్రజాస్వామ్య పండుగ పోలింగ్‌ను విజయవంతం చేసేందుకు తమ వంతు కృషిలో భాగంగా ఈ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలను ఓటు హక్కు వేయడంలో భాగస్వాములుగా చేసేందుకు తమ వంతు ప్రయత్నమని చెప్పారు. ఇదివరకు ఢిల్లీలో ఈ ఆఫర్ ఇచ్చారు. కానీ తాజాగా శుక్రవారం నాడు 24 రాష్ట్రాల అసోసియేషన్ హెడ్స్ భేటీ అయ్యారు. పోలింగ్ రోజున పెట్రోల్, డీజిల్ పైన డిస్కౌంట్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

 పలు నియోజకవర్గాల్లో వెసులుబాటు

పలు నియోజకవర్గాల్లో వెసులుబాటు

ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన పెట్రోల్ బంక్‌లలో లభిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఆయా పోలింగ్ తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దేశంలోని పలు నియోజకవర్గాల్లో ఈ వెసులుబాటు ఉంది. పెట్రోల్, డీజడిల్ పట్టే వ్యక్తికి పేరు, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. డిస్కౌంట్ ధరకే పెట్రోల్, డీజిల్ అందించే రిటైలర్లు ఈ డిస్కౌంట్‌ను డీలర్ కమిషన్‌లో అడ్జస్ట్ చేసుకుంటారు.

English summary

కండిషన్స్ అప్లై: ఎన్నికల రోజు ఓటేసి సిరా చుక్క చూపిస్తే పెట్రోల్, డీజిల్‌పై డిస్కౌంట్! | Vote and Get discount at Petrol pumps

Selected fuel retailers will offer a discount of 50 paise per litre on Petrol and Diesel to consumers who show voting mark on polling day in resective constituencies across the country.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X