లోకసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంపద, సంక్షేమం అనే రెండు లక్ష్యాలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ఈ పథకాలను అమలు చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి (ఒకవేళ ప్రధాని అయితే) పదిహేడు లక్షల కోట్ల నుంచి పద్దెనిమిది లక్షల కోట్ల వరకు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కనీస ఆదాయ పథకం కింద 5 కోట్ల కుటుంబాలకు నెలకు రూ.6వేల చొప్పున సంవత్సరానికి రూ.72వేలు ఇస్తామని చెప్పారు. న్యాయ్ స్కీం కింద దీనిని అందిస్తామని తెలిపారు.
బాలాకోట్ తీవ్రవాద దాడుల నేపథ్యంలో బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద హామీలు ఇస్తుందని అంటున్నారు. న్యాయ్ స్కీం కూడా అలాంటిదేనని అంటున్నారు. ఇటీవల రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికిరూ.6వేలు ఇస్తామని ప్రధాని ప్రకటించారు. ఇది అమలవుతోంది. 12 కోట్ల మంది చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది ఊరట.

ప్రభుత్వ పథకాలు, ఇచ్చిన హామీలు అమలు చేయడం ఏ ప్రభుత్వానికి అయినా సులుువు కాదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద పెద్ద హామీలు ఇస్తోందని, వీరి మేనిఫెస్టోను కనీసం అమలు చేయాలంటే 17 నుంచి 18 లక్షల కోట్ల వరకు అవసరమని అంచనా వేస్తున్నారు.
కేవలం న్యాయ్ స్కీంకే రూ.3.6 లక్షల కోట్లు అవుతాయని, అలాగే ఎన్ఆర్ఈజీఏను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచితే మరో రూ.30వేల కోట్లు అవుతాయని, అంటే మొత్తం రూ.90 వేల కోట్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఆహారం, ఫ్యూయల్, ఫెర్టిలైజర్ సబ్సిడీలకు మరో ఏడాదికి రూ.3 లక్షల కోట్లు అవుతుందని చెబుతున్నారు. వీటికే రూ.7.6 లక్షలు అవసరమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం రుణ అంచనా కంటే ఇది అరవై వేల కోట్ల రూపాయలు ఎక్కువ.
అంతేకాదు, రాహుల్ గాంధీ 22 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. చదువుకు మరిన్ని నిధులు కేటాయిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. వీటితో పాటు హెల్త్, డిఫెన్స్‌కు కూడా నిధులు పెద్ద మొత్తంలో అవసరం. 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రకారం సెంట్రల్ సెక్టార్ స్కీంలు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌లకు వరుసగా రూ.8.6 లక్షల కోట్లు, రూ.3.27 లక్షల కోట్లు అవసరం. అంటే రూ.12 లక్షల కోట్లు. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు కావాలంటే మరో రూ.ఐదారు లక్షల కోట్లు అవసరమని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications