మనీలాండరింగ్ కంపనీలపై కఠిన చర్యలు ,సీబీడీటీ

పెద్ద నోట్ల రద్దు సమయంలో మనిలాండరింగ్ ,అక్రమాలకు పాల్పడిన కంపనీల పై ఆదాయపు పన్ను శాఖ మరోసారి కొరడా ఝలిపించింది.అక్రమాలకు పాల్పడిని లక్షలాదీ కంపనీల ఖాతాలను క్షుణ్ణంగా పరీశీలించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ ఆదాయపన్ను కార్యాలయ అధికారులను ఆదేశించింది.అక్రమాలు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవలని ఆదేశించింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత మనీలాండరింగ్

పెద్ద నోట్ల రద్దు తర్వాత మనీలాండరింగ్

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఎన్నో అక్రమాలకు పాల్పాడ్డాయి. దీంతో అనుకున్నస్థాయిలో పెద్ద నోట్ల రద్దు ఫలితాలను ఇవ్వలేదు,దీంతో నోట్ల రద్దు తర్వాత జరిగిన లావాదేవీలు జరిపిన సంస్థలు ,కంపనీల అక్రమాలపై ప్రభుత్వం కోరడా ఝలిపిస్తుంది. ఆయా సంస్థలు జరిపిన లావాదేవీలపై క్షణ్ణంగా పరీశీలిస్తోంది.

అక్రమాలకు పాల్పపడిన మూడు లక్షల కంపనీలు రద్దు

అక్రమాలకు పాల్పపడిన మూడు లక్షల కంపనీలు రద్దు

దేశవ్యాప్తంగా నోట్ల రద్దు సమయంలో మని లాండరింగ్ కు పాల్పడిన సుమారు మూడు లక్షల కంపనీలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో గత రెండు సంవత్సరాలుగా ఆయా కంపనీల కార్యకలాపాలపు పరీశీలించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ (సీబీడీటి ) భావిస్తోంది. వాటి రికార్డులను తీసుకొని, అవి ఎలాంటీ తప్పులకు పాల్పడ్డాయో ,ఏ కార్యకలాపాలు నిర్వహించాయో చూడాలని ఆదాయపన్ను కార్యాలయాలకు సూచించింది.కాగా వాటికి సంబంధించి ఆయా కంపనీల బ్యాంకు ఖాతాల డిపాజిట్ల తో వాటి పరిశీలనలను క్షుణ్ణంగా పరీశీలించాలని ఆదేశించింది.ఈ విధంగా రద్దు చేసిన మూడు లక్షల కంపనీల్లో కనీసం కొద్దిమందైనా పన్ను నేరాలకు పాల్పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.దీంతో వీటిపై పన్ను ఎగవేత ,మనిలాండరింగ్ వంటి చర్యలు తీసుకోవాలని చూస్తున్నటు వారు పేర్కోన్నారు.దీంతో వాటిని ఈడికి సైతం రిఫర్ చేయాలని భావిస్తున్నారు.

ఎన్‌సిఎల్‌టిలో పిటిషన్

ఎన్‌సిఎల్‌టిలో పిటిషన్

కాగా వరుసగా రెండెళ్లపాటు వార్షిక రిటర్నులు సమర్పించని కంపనీలతోపాటు అక్రమ పద్దతుల్లో నిధులను మళ్లించిన సంస్థలను కార్పోరేట్ వ్యవహరాల శాఖ రద్దు చేసింది. మరోవైపు ఈ కంపనీల నుంచి రూ. వేల కోట్ల పన్ను రికవరీలను రాబట్టుకునేందుకు ఎన్‌సీఎల్‌టీలో పటిషన్ వేయాలని ఆదాయపు పన్ను శాఖకు సీబీడీటీ సూచించింది.

గరిష్ట సమయంలో పూర్తి చేయాలి.

గరిష్ట సమయంలో పూర్తి చేయాలి.

దేశవ్యాప్తంగా ఉన్న ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు ఖఛ్చితమైన గడువులోగా ఈ కంపనీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టుకోవాలని సీబీడీటీ కోరింది. నిధుల మళ్లింపు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇందులో అవసరమైతే రీజిస్టార్ ఆఫ్ కంపనీస్ కూడ జోక్యం చేసుకోవాలని స్సష్టం చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+