ఆర్బీఐ గవర్నర్‌కు రక్షణ కోరిన రఘురాం రాజన్, మార్పుకు సమయం వచ్చింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌కు చట్టబద్దమైన భద్రత ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. తద్వారా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని అభిప్రాయపడ్డారు. ఈ బ్యాంకు స్వతంత్రంగా పని చేయాలన్నారు.
ఆర్బీఐ గవర్నర్ విషయంలో చట్టబద్దమైన పరిమితులను లేదా చట్టబద్దమైన రక్షణ కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని రఘురాం రాజన్ తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ టర్మ్‌ను ప్రొటెక్ట్ చేయాల్సి ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవీకాలం ముగిసేంత వరకు ఎలాంటి ఒత్తిళ్లు పని చేయకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. మార్పుకు సమయం ఆసన్నమైందన్నారు.

లోక్‌పాల్ వలె సెంట్రల్ బ్యాంకు గవర్నర్ పదవికి కూడా భద్రత ఉండాలని వ్యాఖ్యానించారు. ఆర్బీఐ పైన ప్రభుత్వం అధికారం పరిమితంగా ఉండాలని చెప్పారు. ఆర్బీఐపై ప్రభుత్వం అధికారం పరిమితంగా ఉండాలని తాను చెప్పానని, కానీ ఇందుకు రాజ్యాంగ సవరణలు అవసరం లేదని చెప్పరారు. ఇందుకు మనకు మనం క్రమశిక్షణ పాటించాలన్నారు.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మినిమం ఇన్‍కం గ్యారెంటీ, ఉద్యోగాలు తదితర అంశాలపై కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఇటీవల రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం (మినిమమ్ ఇన్‌కం గ్యారెంటీ) పైన కూడా రఘురాం రాజన్ స్పందించారు. ఆయన తన పుస్తకంలో యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పథకంపై ప్రశ్నించగా, రాజన్ స్పందిస్తూ... సమర్థవంత లక్ష్యంతో ఈ పథకం ప్రారంభిస్తే అది నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర పథకాలపై ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications