ద్రవ్య క్రమశిక్షణపై ఆందోళన: రాహుల్ రూ.72వేలకు మోడీ ప్రభుత్వం రూ.1,06,800 కౌంటర్

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అమలుచేయలేని, మోసపూరిత హామీ ఇచ్చారని, ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్య క్రమశిక్షణ దెబ్బతినే హామీ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్యంత నిరుపేద కుటుంబాలకు కనీస ఆదాయం కింద ఏటా రూ.72వేల చొప్పున అందిస్తామన్నారు. నెలకు రూ.12వేల లోపు ఆదాయం ఉన్న 5 కోట్ల కుటుంబాల్లోని 25 కోట్ల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుందన్నారు.

 అధికారంలోకి వస్తే ఎవరికి, ఎంత ఇస్తారంటే?

అధికారంలోకి వస్తే ఎవరికి, ఎంత ఇస్తారంటే?

ఈ పథకంపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలో కొంత స్పష్టత లోపించిందని అంటున్నారు. ప్రతి నిరుపేదకు రూ.12వేల ఆదాయం తగ్గకుండా చూసుకుంటామని, దేశంలోని 5 కోట్ల కుటుంబాలకు ఏటా గరిష్ఠంగా రూ.72వేలు ఇస్తామన్నారు. నిజానికి రూ.12వేలు ఇవ్వాలంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఏడాదికి రూ.1.44 లక్షలు ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత నిరుపేద కుటుంబమైనా కనీసం రోజుకు రెండువందల చొప్పున నెలకు రూ.6 వేల ఆదాయాన్ని ఆర్జిస్తోందని, ప్రభుత్వం తరఫున రూ.6 వేలు ఇచ్చి ఆ కుటుంబాల ఆదాయాన్ని రూ.12 వేలకు చేరుస్తామనేది ఆతని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని చెబుతున్నారు. కనీస ఆదాయ రేఖను రూ.12వేలుగా నిర్ధరించామని, ఆ మొత్తంలో ఎంత తక్కువైతే అంత మొత్తాన్ని ప్రభుత్వం తరఫున ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అంటే ఓ కుటుంబం నెలకు రూ.7వేలు సంపాదిస్తే వారికి రూ.5వేలు (అంటే కుటుంబ ఆదాయం రూ.12వేలు అయ్యేలా) ఇస్తారు. ఈ లెక్కన సరాసరి రూ.6వేలుగా వేసి, సంవత్సరానికి రూ.72వేలు అని చెప్పారని అంటున్నారు.

 ఐదేళ్లలో నిర్మించిన ద్రవ్య క్రమశిక్షణ దెబ్బతింటుంది

ఐదేళ్లలో నిర్మించిన ద్రవ్య క్రమశిక్షణ దెబ్బతింటుంది

రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం హామీని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ తప్పుపట్టారు. ఇది పని సంస్కృతికి వ్యతిరేకమని, ద్రవ్య క్రమ శిక్షణను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎన్నికల్లో నెగ్గేందుకు చందమామను తెచ్చిస్తానని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని, అందులో భాగంగానే రాహుల్‌ ఇప్పుడు ఈ పథకాన్ని ప్రకటించారని, అది ఎప్పటికీ అమలుకాదని, ఈ పథకానికి జీడీపీలో 2 శాతం, బడ్జెట్‌లో 13 శాతం నిధులు అవసరమవుతుందనుకున్నా ప్రజల వాస్తవ అవసరాలు అపరిష్కృతంగానే ఉండిపోతాయన్నారు. కాంగ్రెస్‌ గతంలో గరీబీ హటావో, వన్ ర్యాంక్ వన్ పింఛన్, ఆహార భద్రత వంటి హామీల్ని నెరవేర్చలేదన్నారు. కనీస ఆదాయ పథకం కూడా అలాంటిదే అన్నారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి కూడా ఈ ప్రకటనపై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించింది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య క్రమశిక్షణ మధ్య సమతౌల్యం కోసం గత అయిదేళ్లలో ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఇలాంటి వాటి వల్ల సమతౌల్యం దెబ్బతింటుందని పేర్కొంది.

 మోడీ ప్రభుత్వం ఎంత పంచుతుందో తెలుసా?

మోడీ ప్రభుత్వం ఎంత పంచుతుందో తెలుసా?

రాహుల్ గాంధీది మోసపూరిత ప్రకటన అని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల్ని కాంగ్రెస్ వంచించినట్లుగా మరే ఇతర పార్టీ వంచించలేదన్నారు. ఐదు కోట్ల కుటుంబాలకు రూ.72వేల చొప్పున ఇస్తే అది రూ.3.6 లక్షల కోట్లు అవుతుందని, ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఇస్తున్న మొత్తంతో పోలిస్తే ఇది మూడింట రెండో వంతు కన్నా తక్కువేనని, అందువల్ల ఇది మోసపూరిత ప్రకటన అన్నారు. నగదు బదిలీ, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్‌ వంటి పథకాల ద్వారా మోడీ ప్రభుత్వం పేదలకు ఇప్పటికే ఏటా రూ.5.34 లక్షల కోట్లను అందిస్తోందన్నారు. దీన్ని ఐదు కోట్ల కుటుంబాలకు పంచితే ఒక్కో కుటుంబానికి రూ.1,06,800 అందించినట్లవుతోందన్నారు. కానీ కాంగ్రెస్‌ రూ.72వేలు ఇస్తామని చెబుతోందన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+