For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెల్హివరీ విలువ ఇప్పుడు రూ.14వేల కోట్లు, సాఫ్ట్ బ్యాంక్ భారీ పెట్టుబడి

By Chanakya
|

ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ డెల్హివరీ (Delhivery) యూనికార్న్ క్లబ్‌లో చేరిపోయింది. లాజిస్టిక్ స్పేస్‌లో దేశంలో ఓ కంపెనీ ఈ క్లబ్‌లో చేరడం మొదటిసారి. యూనికార్న్ క్లబ్ అంటే.. సదరు సంస్థ వేల్యుయేన్ బిలియన్ డాలర్ల మార్క్ అని అర్థం. మన దేశ కరెన్సీలో సుమారు రూ.7 వేల కోట్ల వేల్యుయేషన్ ఉంటే దాన్ని యూనికార్న్ అంటాం. స్టార్టప్ సంస్థలు ఈ స్థాయికి చేరుకోవాలని ఉవ్విళ్లూరుతూ ఉంటాయి. తాజాగా చైనాకు చెందిన సాఫ్ట్ బ్యాంక్ సంస్థ తమ విజన్ ఫండ్ ద్వారా డెల్హివరీలో 413 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2900 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తాజా ఇన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా సాఫ్ట్ బ్యాంక్ సంస్థ డెల్హివరీలో 22.4 శాతంవాటాను కైవసం చేసుకుంది. వాటాతో పాటు బోర్డులో కూడా భాగస్వామ్యాన్ని దక్కించుకుంది. ఈ వేల్యుయేషన్‌లో భాగంగా ఒక్కసారిగా దీని విలువ 2 బిలయన్ డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో ఎంతలేదన్నా రూ.14 వేల కోట్లు.

సాఫ్ట్ బ్యాంక్ లాజిస్టిక్స్ స్పేస్‌లో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తోంది. అందులో భాగంగానే భారీ వేల్యుయేషన్ ఇచ్చి మరీ డెలివరీలో వాటా కొనింది. ఇప్పటికే పేటిఎం, ఉబర్‌లో వాటాలు ఉన్న సాఫ్ట్ బ్యాంక్.. డెల్హివరీ సేవలను కూడా పూర్తిగా వాడుకోవాలని చూస్తోంది. మూడు కంపెనీల మధ్య సినర్జీని కుదిర్చి వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని స్కెచ్ వేసింది. ఇప్పటికే పేటిఎం మాల్ ద్వారా ఎంతో కొంత బజ్ క్రియేట్ చేసిన పేటిఎం.. లాజిస్టిక్స్ విషయంలో మాత్రం వెనుకబడింది. ఆ లోటు డెల్హివరీ భర్తీ చేయబోతోంది. మరోవైపు ఉబర్ కూడా ఈట్స్‌ను స్టార్ట్ చేసింది. త్వరలో గ్రాసరీ డెలివరీ సహా కన్సీర్జ్ సర్వీస్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఇలా తాను పెట్టుపెట్టిన వ్యాపారాలకు లాజిస్టిక్స్ సహకారం అవసరం ఉన్న నేపధ్యంలో తెలివిగా సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులు పెట్టింది. దీని వల్ల అన్ని కంపెనీలూ ఎదగడం ఒక ఎత్తైతే, బిజినెస్ రొటేషన్ అయి తమ దగ్గరే తిరుగుతుంది.

రూ.25వేల వరకు పెరగనున్న టాటా కార్ల ధరలు, కారణాలివేరూ.25వేల వరకు పెరగనున్న టాటా కార్ల ధరలు, కారణాలివే

delivery entered in to unicorn club with softbanks latest investment

డెల్హివరీ ఎలా ఎదిగిందంటే...

డెల్హివరీ సంస్థ మే 2011లో నెలకొల్పారు. అప్పటో ఈ సంస్థకు సిరీస్ ఏ ఫండింగ్‌ను టైమ్స్ ఇంటర్నెట్ అందించింది. ఆ తర్వాత సిరీస్ బి 2013లో, సిరీస్ సి 2014లో, సిరీస్ డి 2015లో వచ్చిపడింది. 2015 నుంచే టైగర్ గ్లోబల్, ఫోసన్ వంటి సంస్థల కన్ను ఈ కంపెనీపై పడింది. దీంతో అప్పటి నుంచి భారీగా పెట్టుబడులు వచ్చి పడ్తూనే ఉన్నాయి. ఏటా 65 శాతం వృద్ధిని కనబరుస్తున్నామని ప్రకటించిన డెల్హివరీ ప్రస్తుతం 15 వేల పిన్‌కోడ్స్‌కు సరుకు డెలివర్ చేస్తోంది. ఇప్పుడు దేశంలో డెలివర్ అయ్యే ప్రతీ నాలుగు పార్సిళ్లలో ఒకటి డెల్హివరీ నుంచే అవుతోంది అనేది సంస్థ మాట. రోజుకు 5 లక్షల పార్శిళ్లు సరఫరా చేస్తోంటే, ఇప్పటి వరకూ 45 కోట్ల లావాదేవీలు చేసినట్టు వెల్లడించింది డెల్హివరీ. మొత్తానికి పదేళ్ల లోపే ఈ లాజిస్టిక్స్ సంస్థ రెండు బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ మార్కుకు చేరడం స్టార్టప్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.

English summary

డెల్హివరీ విలువ ఇప్పుడు రూ.14వేల కోట్లు, సాఫ్ట్ బ్యాంక్ భారీ పెట్టుబడి | delivery entered in to unicorn club with softbanks latest investment

Renowned logistics company delhivery entered in to unicorn club with softbanks latest investment. China's Softbank took 22 pc stake in company for $413 Mn.
Story first published: Monday, March 25, 2019, 11:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X