న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఇటీవలి కాలంలో యువత కేవలం టీవీల ముందు మాత్రమే కూర్చోవడం లేదు. తమ తమ మొబైల్ ఫోన్లలో మ్యాచ్‌లు చూస్తున్నారు. ఎప్పటికి అప్పుడు స్కోర్ తెలుసుకుంటున్నారు. ఐపీఎల్ సమయాన్ని అన్ని కంపెనీలు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తాయి. ఇందులో భాగంగా మొబైల్ కంపెనీలు కూడా యువతకు డేటా పైన ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి.

బీఎస్ఎన్ఎల్ ఆఫర్
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఐపీఎల్ టీ 20 లీగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఎస్టీవీ 499 ఆఫర్లను తీసుకు వచ్చింది. ఈ స్పెషల్ క్రికెట్ ప్లాన్ ద్వారా రోజుకు 1జీబీ డేటా వస్తుంది. ఫోన్ కాల్స్ అపరిమితం. ఎస్ఎంఎస్‌లు ఉచితం. 90 రోజుల పాటు ఉచిత క్రికెట్ ఎస్ఎంఎస్‌ల అలర్ట్. రూ.199తో కూడా బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఇస్తుంది. ఇధి 28 రోజులకు పరిమితం.

జియో ఐపీఎల్ ప్లాన్
జియో నుంచి జియో 197 ప్లాన్ వచ్చింది. రోజుకు 2 జీబీ డేటా. అపరిమిత కాల్స్. ఉచిత సందేశాలు. ఈ ప్లాన్ 28 రోజులు ఉంటుంది. హాట్‌స్టార్‌తో ఉచిత యాక్సెస్. లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఉచితం. రూ.299తో 28 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది.

వొడాఫోన్-ఐడియా ఐపీఎల్ ప్లాన్
వొడాఫోన్-ఐడియా నుంచి 511 ఐపీఎల్ ప్లాన్ వచ్చింది. ఐపీఎల్ కోసం లైవ్ టీవీ యాక్సెస్ అందిస్తోంది. రూ.511తో రీచార్జ్ చేస్తే 84 రోజులు వస్తుంది. రోజుకు 2జీబీ డాటా వస్తుంది. అపరిమిత ఫోన్ కాల్స్. వంద ఎస్సెమ్మెస్‌లు.

ఎయిర్‌టెల్ ఐపీఎల్ ప్లాన్
ఎయిర్‌టెల్ కూడా ఐపీఎల్ కోసం రెండు ప్లాన్‌లు అందిస్తోంది. ఒకటి రూ.249, రూ.448 ప్లాన్‌లు ఉన్నాయి. రూ.249 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా ఉచితం. అపరిమిత కాల్స్. ఎస్సెమ్మెస్‌లు ఉచితం. ఎయిర్‌టెల్ టీవీకి యాక్సెస్. 28 రోజులకు ఈ ప్లాన్. రూ.448 ప్లాన్ రెండోది. ఇది 82 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా. ఉచిత ఎస్సెమ్మెస్‌లు. అపరిమిత కాల్స్. ఎయిర్‌టెల్ లైవ్ యాక్సెస్.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications