ఇటివల రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ పథకం చెల్లింపుల్లో వడపోతలు మొదలయ్యాయి....ఆదాయపు పన్ను కట్టే రైతుల ఖాతాలను పీఎమ్ కిసాన్ పథకం నుండి వ్యవసాయ శాఖ తొలగించింది.

రాష్ట్రంలో 52 లక్షల రైతు కుటుంభాలకు రైతు భీమా పథకం...
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 52 లక్షల రైతు కుటుంభాలకు కోత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చింది.. వారికి రైతు బంధు, రైతు బీమా పథాకాలను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుంది.. రైతు బంధు స్కీం క్రింద ఎకరానికి నాలుగు వేల నుండి ఇటివలే సిఎమ్ కేసిఆర్ అయిదు వేల రుపాయలను అందిస్తామని అసెంబ్లిలో ప్రకటన కూడ చేశారు..ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నేరుగా రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఇలాంటీ పథకాన్ని దేశ వ్యాప్తంగా రైతులకు నగదును పంపీణి చేసేందుకు పిఎమ్- కిసాన్ పథకాన్ని తీసుకువచ్చారు..దీంతో రానున్న ఎన్నికల లోపు రైతులకు లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో రైతుల ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది....కేంద్రానికి 52 లక్షల ఖాతాల సంబంధించి వివరాలను రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే అందించింది..

రైతు బంధు ఖాతాల్లో వడపోతలు, 80 వేల ఖాతాలు తోలగింపు
ఇటివల కేంద్రం రైతుల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన పిఎమ్ కిసాన్ పథకాన్ని ప్రారంభించింది..ఐదు ఎకరాల లోపు ఉన్న రైతు కుటుంభాలకు సంవత్సరానికి ఆరువేల రుపాయలను ప్రకటించింది..
అయితే దేశ వ్యాప్తంగా పిఎమ్ కిసాన్ పథాకాన్ని అమలు చేస్తున్న కేంద్రం వాటిలో వడపోతలు మొదలు పెట్టింది...తెలంగాణ నుండి ఉన్న రైతుల ఖాతాల్లో ఆదాయపు పన్ను ఎంత మంది కడుతున్నారో వివరాలు ఇవ్వాలని కేంద్ర వ్వవసాయ శాఖ , ఆదాయపు పన్ను శాఖను కోరింది..దీంతో అన్ని వడపోతలు తర్వాత సుమారు 80 వేల మంది రైతులు ఆదాయపు పన్ను కడుతున్నారని లేక్క తేల్చింది,ఆదాయపు పన్ను శాఖ .దీంతో వారికి పిఎమ్ కిసాన్ పథకం వర్తించకుండా వారి ఖాతాను జాబితా నుండి తొలగించింది.

రాష్ట్రంలో పిఎమ్ కిసాన్ పథకం లబ్ధిదారులు 25 లక్షల లోపే...
కేంద్రం కుటుంభాల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది..ఇందులో భాగంగానే మొత్తం 52 లక్షల మంది రైతులను, కుటుంభాలుగా లెక్కిస్తే 35 లక్షలని తేలింది. కాగా 35 లక్షల కుటుంభాల్లో 20.35 లక్షల మంది పేర్లను పిఎమ్ -కిసాన్ పోర్టల్ లో నమోదు చేశారు. ఇంకా మిగిలిన వారిని పోర్టల్ లో చేర్చాల్సి ఉంది .ఇక వ్యవసాయ శాఖ వడబోతల అనంతరం రాష్ట్రంలో 24 నుండి 25 లక్షల లోపే పిఎమ్ కిసాన్ పథకానికి అర్హులుగా తేలే అవకాశాలు కనిపిస్తున్నయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాగా పోర్టల్ లో నమోదైన రైతులకు దఫాల వారిగా రెండు వేల చొప్పున జమ చేస్తోంది కేంద్రం.


Click it and Unblock the Notifications