For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల రోజుల్లో బెస్ట్ జంప్ ! భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

By Chanakya
|

మూడు రోజుల వరుస సెలవుల తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకాయి. నిఫ్టీ 11000 దిశగా పరుగులు పెట్టించింది. ఒక్క అడుగు దూరంలో మైలు రాయిని తాకలేక ఆగినప్పటికి ఈ నెల రోజుల్లో ఇది ఒన్ ఆఫ్ ది బెస్ట్ ర్యాలీ. ఒక్క ఐటీ మినహా అన్ని రంగాల షేర్లూ లాభాల్లో ముగిశాయి. ఆశ్చర్యంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ 2.5 శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి. చివరకు నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 10987 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 378 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 510 పాయింట్లు లాభంతో ముగిశాయి.

మిడ్ క్యాప్ మానియా

మిడ్ క్యాప్ మానియా

గత రెండు వారాల నుంచి మిడ్, స్మాల్ క్యప్ స్టాక్స్‌లో అనూహ్యమైన ర్యాలీ కొనసాగుతోంది. మార్కెట్లతో సంబంధం లేకుండా చాలా వరకూ బీటెన్ డౌన్ స్టాక్స్‌ అన్నీ ఎగిరి గంతేస్తున్నాయి. అదే ట్రెండ్ ఈ రోజు కూడా కొనసాగింది. సుజ్లాన్ ఎనర్జీ 25 శాతం, రెప్కో హోం ఫైనాన్స్ 21 శాతం, జిందాల్ స్టెయిన్‌లెస్ 16 శాతం, దిలీప్ బిల్డ్‌కాన్ 15 శాతం, మన్‌పసంద్ బెవరేజెస్ 12 శాతం, ప్రిజం సిమెంట్ 11 శాతం, ఎడిల్వైజ్, గ్రాఫైట్, ఇండియా బుల్స్ హౌసింగ్, రెయన్ ఇండస్ట్రీస్, వక్రంజీ, జీవీకె పవర్ వంటి స్టాక్స్ 10 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయ్యాయి.

హౌసింగ్‌కు కిక్

హౌసింగ్‌కు కిక్

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కీలకమైన క్యాపిటల్ అడిక్వసీ రేషియోలను(సిఏఆర్) పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 12 సిఏఆర్‌ను 15 శాతానికి పెంచేందుకు అభిప్రాయాలను సేకరిస్తోంది. అధిక లెవరేజీ తీసుకుని నిధులు ఇచ్చే కంపెనీలకు ఇది ఒక రకంగా నెగిటివ్ న్యూస్. అయితే ఐఎల్ఎఫ్ఎస్ ఉదంతం వల్ల లిక్విడిటీ మరింత కష్టమవుతుంది అనుకుంటున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు మరింత ప్రభావం చూపుతాయి.వాస్తవానికి ఇది నెగిటివ్ న్యూస్ అయినా ఇదే సెక్టార్‌లో ఉన్న అనేక స్టాక్స్ లాభాల్లో దూసుకుపోయాయి.ఇండియాబుల్స్ హౌసింగ్ 10 శాతం లాభపడింది. రెప్కో హోం ఫైనాన్స్ 22 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 5 శాతం, క్యాన్‌ఫిన్ హోమ్స్ 7 శాతం, దివాన్ హౌసింగ్ 4 శాతం లాభాల్లో ముగిశాయి.

ఆటో ప్యాక్ స్పీడ్

ఆటో ప్యాక్ స్పీడ్

టాటా మోటార్స్‌లో టాటా సన్స్‌ వాటాలు పెంచుకున్న నేపధ్యంలో స్టాక్ మరింత దూసుకుపోయింది. ఇదే కాకుండా సేల్స్ కూడా కొద్దో గొప్పో ప్రోత్సాహకరంగా ఉన్న నేపధ్యంలో టాటా మోటార్స్ స్టాక్ 8 శాతం లాభపడింది.ఇదే బాటలో మిగిలిన కంపెనీల స్టాక్స్ కూడా ఎగిరి గంతేశాయి. ఐషర్ మోటార్స్ 8 శాతం, అశోక్ లేల్యాండ్ 5 శాతం, ఎస్ఎంఎల్ ఇసుజు 9 శాతం పెరిగాయి.ఇవే కాకుండా కొన్ని ఆటో యాన్సిలరీ స్టాక్స్ కూడా లాభాల్లో ముగిశాయి.

లాభాలు బిల్డ్ చేస్తున్న దిలీప్

లాభాలు బిల్డ్ చేస్తున్న దిలీప్

దిలీప్ బిల్డ్‌కాన్ స్టాక్ వరుసగా నాలుగో రోజు కూడా భారీ లాభాల్లో కదలాడుతోంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 20 రోజుల యావరేజ్ వాల్యూమ్స్‌తో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. ఈ స్టాక్ ఈ రోజు 20 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయి రూ.536 దగ్గర క్లోజైంది.

English summary

నెల రోజుల్లో బెస్ట్ జంప్ ! భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ | The stock market ended in heavy profit

After three days of hiatus, the early stock market index jumped ahead with the thrust of doubling. Nifty runs towards 11000. One step is a stone mile This is the Own of the Best Reality in the Month . Only IT stocks ended in all-round stocks. Amazingly mid and small cap indices over 2.5 per cent Closed. Finally, the Nifty closed at 10987 with a 124 point gain. The Sensex ended with 378 points, while the Nifty closed 510 points higher.
Story first published: Tuesday, March 5, 2019, 18:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X