For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్లలో జోష్ .. పరుగులు తీసిన నిఫ్టీ

By Chanakya
|

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు ఫిబ్రవరి నెల ఫ్యూచర్స్ ఎక్స్‌పైరీ వారంలోకి అడుగుపెట్టాయి. ఈ వారంలో ప్రధానంగా జీడీపీ గణాంకాలు - అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య చర్చలు సహా అనేక కీలకమైన ముఖ్యాంశాలు ఉన్నాయి. ఉదయం నుంచి నిస్తేజంగానే సాగిన మార్కెట్లకు మిడ్ సెషన్ తర్వాత ఎక్కడలేని జోష్ వచ్చింది. ఆసియా, యూరోప్ మార్కెట్లలోని లాభాలు మన మార్కెట్లకు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి వచ్చిన మద్దతుతో స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ 10900 పాయింట్ల దిశగా పరుగు పెట్టాయి. చివరకు 85 పాయింట్ల లాభంతో 10880 దగ్గర నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ 342 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 292 పాయింట్ల లాభంతో క్లోజయ్యాయి.

మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి రాగా, ఆటో, ఫిన్ సర్వ్, ఐటీ, బ్యాంకింగ్ కౌంటర్లలో ఉత్సాహం కనిపించింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా అర శాతానికిపైగానే లాభాలను నమోదు చేశాయి. యెస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గ్రాసిం, అల్ట్రాటెక్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిస్తే.. అదానీ పోర్ట్స్, భారతి ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, హెచ్ పి సి ఎల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

sensex trade profit.. 36 points high sensex

ఐటీ లీడ్ చేసింది
ఐటీ ప్యాక్ ఈ రోజు మార్కెట్లను లీడ్ చేసింది. టీసీఎస్ 3.2 శాతం, ఇన్ఫోసిస్ 2.73 శాతం ఎన్ఐఐటి టెక్, విప్రో 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటివి హెవీ వెయిట్ స్టాక్స్ కావడంతో ఇవి ఒంటి చేత్తో మార్కెట్లను నిలబెట్టాయి.

కావేరీ సీడ్స్ ఎనిమిదో రోజూ అంతే
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన విత్తన సరఫరా సంస్థ ఎనిమిదో రోజు కూడా నష్టాల బాట పట్టింది. జూలై 2016 తర్వాత మళ్లీ ఇప్పుడే ఇన్ని రోజుల వరుసగా స్టాక్ పతనమైంది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ సుమారు 30 శాతం విలువను కోల్పోయింది. ఇంట్రాడేలో రూ.384 వరకూ వెళ్లిన స్టాక్ ఆఖర్లో సుమారు 2 శాతం వరకూ నష్టపోయింది.

క్యాప్లిన్ పాయింట్ పోల్ వాల్ట్
క్యాప్లిన్ పాయింట్ స్టాక్ 19 నెలల గరిష్ట స్థాయికి చేరింది. వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లో ముగిసిన స్టాక్‌లో అనూహ్యమైన వాల్యూమ్స్ నమోదయ్యాయి. ఈ రోజు కూడా 11 శాతం లాభపడిన క్యాప్లిన్ పాయింట్ రూ. 390 దగ్గర క్లోజైంది.

sensex trade profit.. 36 points high sensex

అదానీ పోర్ట్స్ అత్యుత్సాహం
అదానీ పోర్ట్స్‌కు చెందిన సంస్థ అదానీ లాజిస్టిక్స్.. అదే గ్రూపునకు చెందిన అదానీ అగ్రిలాజిస్టిక్స్‌ను రూ.946 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నిర్ణయం మార్కెట్ వర్గాలకు ఏ మాత్రం రుచించలేదు. దీంతో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ స్టాక్ 8 శాతం నష్టపోయింది.

ఐడీఎఫ్‌సి ఫస్ట్ 5 డే ర్యాలీ
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్ స్టాక్ వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిసింది. జూలై 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే వరుసగా ఈ స్టాక్‌లో లాభాలు నమోదయ్యాయి. అయితే చివర్లో లాభాల స్వీకరణ నేపధ్యంలో స్టాక్ కేవలం 0.6 శాతం లాభపడి రూ.45.75 దగ్గర క్లోజైంది.

చక్కెర మరింత తీపి
షుగర్ స్టాక్స్ రిటైల్ రేట్ ఈ మధ్య మరింత పెరిగింది. దీనికి తోడు డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా ఉండకపోవచ్చనే అంచనాల నేఫధ్యంలో షుగర్ స్టాక్స్ ర్యాలీ బాటలో పరుగులు తీస్తున్నాయి. ఈ రోజు కూడా ఉత్తమ్ షుగర్స్, అవధ్ షుగర్స్, దాల్మియా భారత్ షుగర్స్ 15 శాతం వరకూ పెరిగాయి. ఇదే బాటలో ధంపూర్, శ్రీ రేణుకా, త్రివేణి ఇంజనీరింగ్ స్టాక్స్ కూడా 5 శాతానికిపైగానే లాభపడ్డాయి.

చిన్న స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్
గతవారంలో భారీగా పెరిగిన స్మాల్, మైక్రో క్యాప్ స్టాక్స్‌లో ఈ రోజు లాభాల స్వీకరణ వచ్చింది. వాటిల్లో ప్రధానంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్, జై ప్రకాశ్ పవర్, రిలయన్స్ హోం, జెపి అసోసియేట్స్ స్టాక్స్ 5-10 శాతం వరకూ నష్టపోయాయి.

English summary

స్టాక్ మార్కెట్లలో జోష్ .. పరుగులు తీసిన నిఫ్టీ | sensex trade profit.. 36 points high sensex

asia, europian market profits are stock markets josh. to day nifty 10,880 points close, sensex 342 points profit. mainly nifty, it, private banks support bull trade the market
Story first published: Monday, February 25, 2019, 17:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X