For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ నీరసమే ! 27 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

By Chanakya
|

రెండు రోజుల వరుస లాభాల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో నిరుత్సాహంగా ముగిశాయి. రెండు వారాల నుంచి పటిష్టంగా ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు ట్రేడ్‌లో 200 పాయింట్ల వరకూ నష్టపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ షేర్లలో వర్తించిన అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లను నష్టపర్చింది. మొత్తానికి లాభాలు రెండు నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. చివరకు నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 10792 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో, బ్యాంక్ నిఫ్టీ 185 పాయింట్ల నష్టంతో ముగిసింది.

ఉదయం స్థిరంగానే 10783 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ అక్కడక్కడే కొట్టుమిట్టాడింది. కొద్దిగా పెరిగి 10801 స్థాయికి చేరినప్పటికీ పెద్దగా కొనుగోళ్ల మద్దతు ఎక్కడా లభించలేదు. ట్రేడింగ్ అంతా 40 పాయింట్ల టైట్ రేంజ్‌లోనే సాగింది.

ఆటో, మెటల్, రియాల్టీ, ఐటీ రంగ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా ఒక్క శాతం వరకూ లాభపడ్డాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్ పి సి ఎల్, యెస్ బ్యాంక్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, వేదాంతా స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. కొటక్ మహహింద్ర, గెయిల్, రిలయన్స్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, సిప్లా టాప్ 5 లూజర్స్ జాబితాలో చేరాయి.

The Sensex ended the day with a loss of 27 points

సుజ్లాన్.. ఎట్టకేలకు
పవన విద్యుత్ సంస్థ సుజ్లాన్‌ అనూహ్యమైన లాభాలను నమోదు చేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి నేలకు దిగిన ఈ స్టాక్‌లో రెండు, మూడు రోజుల నుంచి పాజిటివ్‌గా ట్రేడవుతోంది. అప్పులను తీర్చేందుకు సంస్థ రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటోంది. వీటికి తోడు డానిష్‌కు చెందిన సంస్థ సుజ్లాన్‌లో వాటా కొనుగోలు చేయబోతోందనే వార్తలు ఈ స్టాక్‌లో జోరు పెంచాయి. ఈ స్టాక్ ఏకంగా 31 శాతం పెరిగి రూ.5.80 దగ్గర స్టాక్ క్లోజ్ అయింది.

అనిల్ కంపెనీలకు ఊరట
అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూపు కంపెనీలకు కొద్దిగా ఊరట లభించింది. నిప్పాన్ సంస్థ రిలయన్స్ ఏఎంసీలో వాటా కొనుగోలు చేయబోతోందనే వార్తల నేపధ్యంలో ఈ గ్రూప్ స్టాక్స్ పరుగులు తీశాయి. రిలయన్స్ క్యాపిటల్ 2 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 7 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 3.5 శాతం, రిలయన్స్ పవర్ 2 శాతం వరకూ లాభపడ్డాయి. రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ హోం ఫైనాన్స్ కూడా 10 శాతం వరకూ పెరిగాయి.

ఏడో రోజూ పడింది
కావేరీ సీడ్స్ స్టాక్ వరుసగా ఏడో సెషన్‌లో కూడా నష్టపోయింది. 15 నెలల కనిష్టానికి స్టాక్ పడిపోయింది. హెచ్ టి విత్తనాల అమ్మకాల నిషేధిస్తూ 14 కంపెనీలను ఏపీ సర్కార్ బ్యాన్ చేసింది. ఈ జాబితాలో కావేరీ సీడ్స్ కూడా ఉంది. అయితే ఈ నిషేధం తమ రెవెన్యూపై పెద్దగా ప్రభావం చూపబోదని కావేరీ సీడ్స్ ఎక్స్ఛేంజీలకు సమాచారం పంపింది. అయితే సంస్థకు వచ్చే రెవెన్యూలో ఏపీ నుంచే 25 శాతం వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఈ స్టాక్ ఈ రోజు కూడా 4 శాతం నష్టపోయి రూ.401 దగ్గర క్లోజైంది.

పెన్నీ స్టాక్స్ పర్ఫారెన్స్
సుజ్లాన్ వార్తల నేపధ్యంలో జివికె పవర్, ఐనాక్స్ విండ్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. కనీసం 15 శాతం పెరిగాయి. జైప్రకాశ్ పవర్ 10 శాతం, పెనిన్సులా ల్యాండ్ 10 శాతం, ఓరియంట్ గ్రీన్ పవర్ 9 శాతం, ఒస్వాల్ గ్రీన్ టెక్ 6 శాతం పెరిగాయి.

English summary

మళ్లీ నీరసమే ! 27 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్ | The Sensex ended the day with a loss of 27 points

The Sensex ended the day with a loss of 27 points and the Nifty closed 185 points lower.Nifty finally ended with a 2 point gain of 10792.stock index indices ended dull in the weekend Selling pressure on banking, financial services and private bank shares also affected the markets.
Story first published: Friday, February 22, 2019, 19:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X