శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయుష్ గోయల్ సెక్షన్ 87ఏ కింద టాక్స్ రిబేట్లను ప్రకటించారు. ఆర్ధిక ఆదాయం ఏడాదికి రూ. 5 లక్షలు ఉంటే పూర్తి స్థాయిలో టాక్స్ రిబేట్లు వర్తిస్తుందని ప్రకటించారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెట్ టాక్సబుల్ ఇన్‌కం ఐదులక్షల రూపాయలు ఉంటే ఎలాంటి టాక్స్‌లు కట్టాల్సిన పనిలేదంటున్నారు ఈవై పార్ట్‌నర్ షాలిని జైన్. అయితే ఐదులక్షలకు పైగా ఆదాయం కలిగి ఉంటే ఈ పన్ను ప్రయోజనాలను వారు పొందరని చెబుతున్నారు. వారు పన్ను కట్టాల్సిందే అని చెబుతున్నారు.
కొత్తగా 2019 ఆర్థిక బిల్లు ప్రకారం ఇన్‌కంటాక్స్ చట్ట పరిధిలో ఉండే సెక్షన్ 87ఏ గరిష్టంగా 12500 మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం అది రూ. 2,500గా ఉంది. ప్రతిపాదించిన ఈ టాక్స్ రిబేట్ రూ3.5 లక్షలు ఆదాయం ఉన్నవారికి కాకుండా రూ. 5 లక్షలు ఆదాయం ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వ్యక్తిగత పన్ను మినహాయింపు ఇస్తోంది. ఇక సీనియర్ సిటిజెన్లు అంటే 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు రూ. 3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండేది. ఇక సూపర్ సీనియర్ సిటిజెన్స్ అంటే 80 ఏళ్ల పైబడి ఉన్నవారికి రూ. 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది.

ఇక 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రూ.2,5001 నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం కలిగి ఉంటే అప్పటి వరకు 10శాతంగా ఉన్న పన్ను విధింపును 5 శాతానికి తగ్గించారు. దీంతో ప్రతి వ్యక్తి ఎవరైతే పన్ను కడుతున్నారో వారికి రూ.12,500 వరకు రిలీఫ్ దక్కింది. ఇక 2014లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కూడా పన్నుకట్టేవారికి ఊరట ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2014 బడ్జెట్‌లో రూ. 2లక్షలు ఉన్న టాక్స్ పరిమితిని రూ.2.5 లక్షలు చేసింది. దాంతో పాటు పలు డిడక్షన్లు కూడా కల్పించింది. సెక్షన్ 80సీ కింద వచ్చే సేవింగ్స్ పరిధిని కూడా పెంచింది. రూ. 50 వేలుగా ఉన్న పరిధిని రూ.1.5 లక్షలు చేసింది. ఇక గృహ రుణాలపై వడ్డీని కూడా రూ.2 లక్షలకు పెంచింది.
ఇక క్లుప్తంగా చెప్పాలంటే సెక్షన్ 80 సి నుంచి 80 యు వరకు ఉన్న అన్ని మినహాయింపులు పోగా మిగిలిన నికర ఆదాయం రూ.5 లక్షలు దాటకుంటే ఎలాంటి పన్ను విధింపు ఉండదు. అన్ని మినహాయింపులు పోను ఇంకా నికర ఆదాయం రూ. 5 లక్షలకు పైగా ఉంటే ప్రస్తుతం అమలు అవుతున్న పన్ను శ్లాబులే వర్తిస్తాయి. అంటే మీ జీతంలో అన్ని నెలకు రూ.41,666/- మించి ఒక్క రూపాయి ఎక్కువగా ఉన్న మీరు టాక్స్ శ్లాబ్‌లో ఉన్నట్లే.


Click it and Unblock the Notifications