నేడే బడ్జెట్: ఆదాయపన్ను పరిమితిలో ఊరట కలిగేనా, వారికి కూడా వరాలు?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. 2014లో గెలిచిన ఎన్డీయేకు.. ఈ టర్మ్‌కు ఇది చివరి బడ్జెట్. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు.. ఈ నాలుగు నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ రోజు మోడీ సర్కార్ ప్రకటించే వరాలపై చర్చ సాగుతోంది.
ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచే అవకాశముందని చెబుతున్నారు. అలాగే రైతులకు వరాలు కురిపించే అవకాశముంది. పట్టణ, గ్రామీణ ప్రజలకు కూడా వరాలు కురిపించే అవకాశాలు ఉంటాయి.
ఈ సమావేశాల్లో ఎలాంటి కాంట్రోవర్షియల్ బిల్స్ పాస్ చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అన్ని పక్షాలు అంగీకరించే బిల్లులే పాస్ అయ్యే అవకాశముంది.

ప్రధానంగా ఆదాయపన్ను పరిమితిపై కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు మంచి ఊరట లభించవచ్చునని భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి ఆదాయపన్ను పరిమితిని 2 లక్షల నుంచి 2.5 లక్షలకు పెంచింది.
ఎన్డీయే ప్రభుత్వం 2014 మేలో అధికారంలోకి వచ్చింది. 2014-2015కు గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. అలాగే 2015-16, 2016-17, 2017-18, 2018-19 ప్రవేశపెట్టింది. ఎన్నికలు ఉన్నందున 2019-20కి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. కాబట్టి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఆర్థిక సంవత్సరం 2019 ఏప్రిల్ 1న ప్రారంభమై 2020 మార్చి 31 ముగుస్తుంది. అయితే ఈ ప్రభుత్వ పాలన మే 26, 2019తో ముగియనుంది.


Click it and Unblock the Notifications