ఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం భేటీ కానున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశం జరగనున్నట్లు సమాచారం. మిడిల్ టర్మ్ బడ్జెట్ సమావేశాలకు 3 రోజుల ముందుగా జరగనున్న మీటింగ్ చర్చానీయాంశంగా మారింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హాజరుకానున్న ఈ భేటీలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, మొండి పద్దులు, లోన్ల మంజూరు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.
కేంద్రం తీసుకున్న కొత్త విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మొండి బకాయిల వసూళ్లల్లో ముందడుగు వేశాయి. 2018 మార్చినాటికి దాదాపు 23వేల కోట్ల రూపాయల మొండి పద్దులను రికవరీ చేశాయి. ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి మొదటి హాఫ్ పోర్షన్ ముగిసేసరికి 60 వేల 700 కోట్ల రూపాయల మేర మొండి బకాయిలు వసూలు చేసుకోగలిగాయి.

ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఈ మొత్తం మరింత పెరగనుంది. మొదటిసారి తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ పనిచేసిన సందర్భంలో (అరుణ్ జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ సమయంలో), పీఎస్‌బీ లకు భారంగా మారిన మొండి పద్దులు వసూలు చేసే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై కమిటీని నియమించారు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అనుసరించడంతో.. కొంతమేర మొండి పద్దులు రికవరీ కావడానికి దోహదపడ్డాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications