For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల ప్రజలు మరోసారి ఉక్కిరి బిక్కిరి?

2014 ఎన్నికల్లో బిజెపి రికార్డు స్థాయిలో లోక్ సభ స్థానాలు గెలుపొంది సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రభంజనం సృష్టించిన విషయం విదితమే.

By bharath
|

2014 ఎన్నికల్లో బిజెపి రికార్డు స్థాయిలో లోక్ సభ స్థానాలు గెలుపొంది సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రభంజనం సృష్టించిన విషయం విదితమే.నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు యావత్ దేశమంతా మోడీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించింది.దేశ ప్రజలు మోడీ పై అపార నమ్మకం విశ్వసం కలిగి ఉండటం వల్ల మోడీ నిర్ణయాలకు అడ్డే లేదు ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ప్రజలు ఆయన వెనక నిలిచేవారు.

పెద్ద నోట్ల రద్దు:

పెద్ద నోట్ల రద్దు:

ఇక తాను చెప్పిందే వేదం చేసిందే శాసనం అనుకున్నారో ఏమో 2016 నవంబర్ లో దేశ ప్రజలపై పిడుగు లాంటి వార్త అదే పెద్ద నోట్ల రద్దు.80 శాతానికి పైగా చలామణిలో ఉన్న రూ.500 మరియు రూ.1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ అర్ధరాత్రి ప్రకటించారు.అంతే ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది.దీని పై ప్రధాని మాట్లాడుతూ నల్లధనం విదేశాల నుండి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు.ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకున్న మోడీ కి ప్రజలనుండి హర్షం వచ్చింది.

జన్ ధన్ ఖాతాలు:

జన్ ధన్ ఖాతాలు:

విదేశాల నుండి నల్ల దన వెనక్కు తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షల రూపాయలు వేస్తామని ఊదరగొట్టారు.దీన్ని నమ్మిన ప్రజలు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలు తెరిచారు.కానీ ప్రధాని ఈ లక్ష్యం కోసం నిర్ణయం తీసుకున్నాడో అది పూర్తిగా విఫలమైనది.ఈ నిర్ణయం వల్ల పేద,మధ్యతరగతి ప్రజలు మాత్రమే తీవ్రంగా నష్టపోయారు.

తేరుకోకముందే మరో బాంబు పేల్చింది:

తేరుకోకముందే మరో బాంబు పేల్చింది:

పెద్ద నోట్ల రద్దు చేసి రెండు ఏళ్ళు గడిచిన కూడా ఇప్పటికీ ఇంకా చాల చోట్ల నగదు కొరతతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇంతలో కేంద్రం జిఎస్టి అనే మరో బాంబు ప్రజలపై సంధించింది.దీనివల్ల ఆర్థికంగా ప్రజలకు మరియు వ్యవస్థలు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి.పన్ను భారం విపరీతంగా పెరిగిపోయింది.వ్యాపారస్తులు ఈ జిఎస్టి దెబ్బకి వందలాది దుకాణాలు ఎత్తేసారు.చాల మంది ప్రజలకు ఇప్పటికీ ఈ జిఎస్టి గురించి అవగాహన లేదు దీనిపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసి ప్రజలపై భారం లేకుండా చూడాలని కోరుకుంటున్నారు.

మరో కీలక నిర్ణయం రిజర్వేషన్:

మరో కీలక నిర్ణయం రిజర్వేషన్:

ఎలాంటి అధ్యయనం చేయకుండా కనీసం ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఇంత పెద్ద కీలక నిర్ణయం తీసుకున్నదాని వెనక పెద్ద పొలిటికల్ గేమ్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అసలు ఉన్నటుండి ఈ రిజర్వేషన్ అంశం ఎందుకు తెరమీదకు వచ్చింది ఇది కేవలం ఎన్నికల ముందు జిమ్మిక్కు కోసమే అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

లోక్ సభ లో బిల్లు:

లోక్ సభ లో బిల్లు:

పార్లమెంట్ చివరి రోజు సమావేశం లో బిల్లు ను హఠాత్తుగా ప్రవేశపెట్టి అధిక సంఖ్యా బలం ఉన్న కారణంగా బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకుంది.మరుసటి రోజు రాజ్యసభలో వాడివేడి చర్చల నడుమ బిల్లు పాస్ జరిగింది.ఐతే ఈ బిల్లు ప్రధాన ఉద్దెశం ఏమనగా అగ్ర కులాల్లో పేదవారికి అదనంగా 10 శతం రిజర్వేషన్ కల్పిస్తుంది.

సుప్రీమ్ కోర్ట్:

సుప్రీమ్ కోర్ట్:

సుప్రీమ్ కోర్ట్ గతం లో చాల సార్లు చెప్పింది రేజర్వేషన్లు 50 శతం మించి ఉండకూడదు అని ఒకవేళ ఆలా చేయాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తుంది అని వెల్లడించింది.గతంలో ముస్లిం మైనారిటీలకు 5 శతం రిజర్వేషన్ ఇస్తూ తీసుకున్న నిర్ణయం పై కోర్ట్ అభ్యన్తరం తెలపడంతో అది 4 శాతానికి కుదించారు.ఇప్పుడు ఏకంగా 10 శాతం అంటే అసలు అమలయ్యే వీలు లేదని నిపుణులు అంటున్నారు.

ఎన్నికల ముందు:

ఎన్నికల ముందు:

ప్రజలకు బిజెపి అలాగే మోడీ పై ఆశలు సన్నగిస్తున్నాయని గమనించి మరోసారి దూరమైన పలు వర్గాల ప్రజలను దగ్గర చేసుకోవాలని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కానీ ఈ నిర్ణయం వల్ల నష్టమా లాభమా అనేది తెలియాలంటే మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే.

Read more about: bjp modi lok sabha quota bill
English summary

మోడీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల ప్రజలు మరోసారి ఉక్కిరి బిక్కిరి? | Lok Sabha Passes Bill Providing 10% Quota for Economically Poor Among Upper Castes

New Delhi: Late on Tuesday evening the Lok Sabha passed the 124th Constitutional Amendment Bill seeking to provide a maximum of 10 percent reservation for the economically weaker among the general category.
Story first published: Saturday, January 12, 2019, 11:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X