For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగుళూరు లో సాఫ్ట్ వేర్లు తగ్గిపోయారట ?

By Sabari
|

సాఫ్ట్‌వేర్‌ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఊడటం కామనే. కానీ ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశీయ ఐటీ పరిశ్రమకు అసాధారణ పరిస్థితి ఎదురైంది. గత ఏడాది నాలుగు బడా ఐటీ కంపెనీల్లో పింక్‌ స్లిప్‌లు ఇవ్వకపోయినా ఉద్యోగుల సంఖ్య తగ్గింది.

బెంగుళూరు లో సాఫ్ట్ వేర్లు తగ్గిపోయారట ?
జనవరి 1, 2017 నాటికి కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌, డిఎక్స్‌సి టెక్నాలజీ, విప్రో, టెక్‌ మహీంద్రాలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 7,19,471గా నమోదుకాగా ఏడాది చివరినాటికి 6,92,794కు తగ్గింది. అంటే, ఏడాదికాలంలో 26,677 మంది సిబ్బంది తగ్గారు. అయితే, తాము ఎవ్వరినీ తొలగించలేదని ఈ సంస్థలు అంటుండటం కొసమెరుపు.

గత ఏడాది కాగ్నిజెంట్‌, విప్రో, టెక్‌ మహీంద్రాలో మొత్తం 3,677 మంది ఉద్యోగులు తగ్గారు. 2016లో ఈ మూడు సంస్థ లు నికరంగా 55 వేలకు పైగా సిబ్బందిని నియమించుకున్నా యి. డిఎక్స్‌సి విషయానికొస్తే.. గత ఏడాది జనవరిలో 1.78 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య సెప్టెంబరు నాటికి 1.55 లక్షలకు పడిపోయింది. చివరి త్రైమాసిక గణాంకాలు మాత్రం అందుబాటులో లేవు.

బెంగుళూరు లో సాఫ్ట్ వేర్లు తగ్గిపోయారట ?
అంటే, 9 నెలల్లోనే 23 వేల మంది సంస్థను వీడారన్నమాట. హ్యూలెట్‌ పాకార్డ్‌ (హెచ్‌పి)కు చెందిన ఎంటర్‌ప్రైజ్‌ బిజినె్‌సతో కంప్యూటర్‌ సైన్స్‌ కార్పొరేషన్‌ (సిఎ్‌ససి) విలీనం ఫలితంగా ఈ సంస్థ అవతరించింది.

టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌లో మాత్రం పెరిగారు..
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) సహా ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ మాత్రం గత ఏడాదిలో ఉద్యోగుల సంఖ్యను మరింత పెంచుకున్నాయి. టిసిఎస్‌లో 12,383, ఇన్ఫోసి్‌సలో 1,928, హెచ్‌సిఎల్‌లో 8,199 మంది ఉద్యోగులు పెరిగారు. ఈ మూడు కంపెనీల్లో కలిపి 22,510 మంది పెరిగినప్పటికీ.. నాలుగు సంస్థల్లో తగ్గిన 26,677 మంది కంటే తక్కువే.

బెంగుళూరు లో సాఫ్ట్ వేర్లు తగ్గిపోయారట ?
ఈ ఏడు బడా సంస్థల్లో నికరంగా 4,167 మంది ఉద్యోగులు తగ్గారు. గత ఏడాది జనవరి 1 నాటికి ఈ ఏడింటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 14,08,823గా నమోదు కాగా.. డిసెంబరు చివరి నాటికి 14,04,656కు తగ్గింది. 2016లో మాత్రం నికరంగా లక్షకు పైగా సిబ్బందిని నియమించుకోగలిగాయి.
బెంగుళూరు లో సాఫ్ట్ వేర్లు తగ్గిపోయారట ?

ఐటీ రంగంలో భారీ మార్పులు
గత ఏడాది వరకు ఐటీ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిన దాఖలాల్లేవు. 1996 నుంచి మొదలు రెండు దశాబ్దాల పాటు ఏడాదికింత పెరుగుతూనే వచ్చారు. కానీ గత సంవత్సరం ఐటీ ఇండస్ట్రీ ఇంటా, బయటా ప్రతికూలతలెదుర్కొంది.

బెంగుళూరు లో సాఫ్ట్ వేర్లు తగ్గిపోయారట ?
హెచ్‌1బి వీసాలపై ఆంక్షలు, అమెరికాలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని ట్రంప్‌ సర్కారు ఒత్తిడి చేయడంతోపాటు ప్రాధాన్యేతర కార్యకలాపాల ఆటోమేషన్‌ ఇంకా ఆధునిక డిజిటల్‌ టెక్నాలజీల వినియోగం వంటి అంశాలు ఐటీ వ్యాపార వైఖరిలో సమూల మార్పులకు కారణమయ్యాయి.

English summary

బెంగుళూరు లో సాఫ్ట్ వేర్లు తగ్గిపోయారట ? | Will 2018 be a recession year for the IT industry in India?

Indian IT sector will not be hampered too much as speculated in the media. The recent FED rate hike by the USA makes us to predict that the global economy is improving & hence to control inflation we can see the recent hike in the monetary policy by the worlds greatest economy
Story first published: Wednesday, February 14, 2018, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X