జాయల్లుకాస్ వ్యాపార సంస్థల పై ఐటీ దాడులు.
జాయ్ అలుకాస్ సంస్థపై ఐటీ కన్ను.

దేశ వ్యాప్తంగా ఉన్న జాయల్లుకాస్ వ్యాపార దుకాణాలపై ఐటీ శాఖవారు బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.పన్ను సకాలంలో చెల్లించట్లేదు అనే ఆరోపణల నేపథ్యంలో ఈదాడులు జరిపామని అధికారులు వెల్లడించారు.హైదరాబాద్ లోని పంజాగుట్ట మరియు కుక్కట్పల్లి దుకాణాల్లో సోదాలు జరిపారు,అంతే కాకుండా వరంగల్,కరీంనగర్,ఖమ్మం,నిజామాబాద్ వంటి నగరాల్లో కూడా సోదాలు జరిపి ఆభరణాల అమ్మకానికి సంబందించిన రసీదులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.వీటికి సంబంధించి కేరళ లో కేసు నమోదు కాగా మొదట కేరళలో ఉన్న దుకాణాలు తరువాత చెన్నై ఐటీ శాఖ వారి సహాయంతో చెన్నై లో కూడా సోదాలు జరిపారు.ఐటీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం వీరు బంగారం కొని వాటిని ఆభరణాలుగా మార్చే క్రమంలో అధిక మొత్తంలో తరుగు చూపించి ప్రభుత్వానికి పన్ను ఎగవేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఈ సంస్థ 1956 మొదలు పెట్టి దాదాపు 11 దేశాలలో సంస్థలు నెలకొల్పింది . జాయల్లుకాస్ గ్రూప్ కార్యకలాపాలలో ఆభరణాలు,డబ్బు మార్పిడి,లగ్జరీ ఎయిర్ చార్టర్,ఫాషన్,పట్టు మరియు మాల్స్ ఉన్నాయి. మొదటి షోరూం 1987 UAE లో స్థాపించబడింది. భారతదేశంలో మొత్తం 130 దుకాణాల్లో బుధవారం సోదాలు జరిపారు,ఇవి గురువారం కూడా కొనసాగుతాయని ఐటీ శాఖ తెలిపింది. ఇండియా, యుఎఇ, యుఎస్ఎ, యుకె, సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియా, కతర్, బహ్రెయిన్, కువైట్ మరియు ఒమన్ శాఖలలో దేశాల్లో జాయల్లుకాస్ సంస్థకు ప్రాతినిధ్యం ఉంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ పాల్ అల్లుకాస్. ఈ సంస్థకు చెందిన సరికొత్త దుకాణము బెంగళూరు లోని ఫీనిక్స్ మాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చసరికి కర్నూల్ మరియు అనంతపురం పట్టణాల్లో 2017 అక్టోబర్ లో దుకాణాలు తెరిచారు. ఈ సంస్థకు దక్షిణ భారతదేశంలో భారీ ఉనికిని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications