ఐటీ రంగంలో ఉద్యోగం చూసుకునే వారికి శుభవార్తను తెచ్చిన 2018
2017 ఏడాది చాలా మంది ఉద్యోగార్థులకు పీడకలగా ఉంది. అయితే అందుకు భిన్నంగా 2018 సంవత్సరం ఐటీ రంగం ఉద్యోగాలతో కళకళలాడనుంది. ఈ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనాలు వస్తున్నాయి.
2017 ఏడాది చాలా మంది ఉద్యోగార్థులకు పీడకలగా ఉంది. అయితే అందుకు భిన్నంగా 2018 సంవత్సరం ఐటీ రంగం ఉద్యోగాలతో కళకళలాడనుంది. ఈ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభించనుందని అంచనాలు వస్తున్నాయి. 'ఆర్థిక సేవలు, డిజిటల్ బిజినెస్‌లలో మెరుగుదల.. ప్రత్యేకించి డిజిటైజేషన్, ఆటోమేషన్‌లలో పెట్టుబడుల పెరుగుదల.. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం వంటి అంశాలు వ్యాపార వృద్ధికి దోహదపడతాయి' అని టీమ్‌లీజ్ సర్వీసెస్ ఐటీ స్టాఫింగ్ జనరల్ మేనేజర్ ఆల్కా ధింగ్రా వివరించారు.

కొత్త కంపెనీల వల్ల కూడా నియామకాల పెరగొచ్చని, దాదాపు 20 శాతానికిపైగా ఎక్కువ కంపెనీలు ఈ ఏడాది నియామకాలు చేపట్టే అవకాశముందని పేర్కొన్నారు. 2018లో దేశీ ఐటీ పరిశ్రమలో దాదాపు 1.8-2 లక్షల కొత్త ఉద్యోగాలు ఉంటాయని అంచనా వేశారు. మోదీ రాకతో డిజిటల్ ఇండియా దిశగా పరుగులు పెడుతోన్న తరుణంలో ఈ పరిశ్రమకు డిజిటల్ నైపుణ్యాలు కలిగిన 50 శాతం ఎక్కువ ఉద్యోగులు అవసరం అవుతారని తెలిపారు. డిజిటల్ ఇండియా వల్ల డిజిటల్ టెక్నాలజీస్, ఏఐ, రోబొటిక్స్‌లలో ఉద్యోగాలు పెరగొచ్చన్నారు. 2020 నాటికి కేవలం కృత్రిమ మేథ(ఏఐ) మాత్రమే అంతర్జాతీయంగా 23 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా వేశారు. కృత్రిమ మేథ (ఏఐ) వంటి పలు అంశాల కారణంగ దేశ ఉద్యోగ మార్కెట్ మార్పు దిశగా పయనిస్తోంది. ఈ మార్పును అధిగమించి మనుగడ సాగించాలంటే నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఒక్కటే మార్గం' అని నిపుణులు సూచించారు. ఆటోమేషన్ టెక్నాలజీలతో మొబైల్ మానుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్ వంటి కొన్ని విభాగాల్లో ఉద్యోగాల తొలగింపు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే రానున్న రోజుల్లో స్టార్టప్స్ జోరు కొనసాగుతుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications