ఆదాయపు పన్ను శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల్లో పలు విస్తు గొలిపే విషయాలు బయటపడ్డాయి. దేశం మొత్తం మీద ఆదాయపు పన్ను కట్టేవాళ్లు ఎంత మందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ వివరాలు మీ కోసం...
మన దేశంలో బిలియనీర్లకు కొదవ లేదు. కార్లు కొనేవాళ్లు, ఇంట్లో విలాసవంతమైన వస్తువులు వాడే వాళ్లు కోట్లలో లేకపోలేదు. అయితే ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించే విషయంలో మాత్రం వారి ఆదాయం పెద్దగా లేనట్లు చూపుతారు. ఆదాయపు పన్ను శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల్లో పలు విస్తు గొలిపే విషయాలు బయటపడ్డాయి. దేశం మొత్తం మీద ఆదాయపు పన్ను కట్టేవాళ్లు ఎంత మందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ వివరాలు మీ కోసం...

1. 2 కోట్ల మంది మాత్రమే పన్ను కట్టారంట
2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎంత మంది ఆదాయపు పన్ను కట్టారు అనే విషయాన్ని ఐటీ శాఖ వెల్లడించింది. దేశం మొత్తం జనాభాలో 1.7% సమానమైన 2 కోట్ల మంది మాత్రమే ఆ ఏడాదిలో ఆదాయపు పన్ను చెల్లించారని ఐటీ శాఖ వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది.

2. 4 కోట్ల మంది రిటర్నులు
అదే ఐటీ రిటర్నులు ఫైలింగ్ చేసిన వారి సంఖ్య విషయానికి వస్తే 4.07 కోట్ల మంది ఉన్నారు. అంతకు ముందు రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే ఐటీ రిటర్నులు ఫైల్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలో ఎక్కువ పన్ను చెల్లించేది ఉద్యోగులు. వారిలో సైతం ఎక్కువ మంది మినహాయింపులకు అర్హత లేకపోయినా ఏవో రుజువులు సమర్పించేసి ఈ విధంగా రిటర్నులు ఫైల్ చేస్తున్నారు.

3. మొత్తం ఆదాయపు పన్ను చెల్లింపు విలువ తగ్గింద
2014-15 మదింపు సంవత్సరంలో 3.65 కోట్ల మంది రిటర్నులు ఫైల్ చేయగా 1.91 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లింపులు చేశారు. అయితే 2014-15లో జరిగిన మొత్తం ఆదాయం పన్ను చెల్లింపుల సంఖ్య రూ.1.91 ట్రిలియన్లు ఉండగా, 2015-16 వచ్చే సరికి రూ.1.88 ట్రిలియన్లకు తగ్గింది. ఇవన్నీ లెక్క గట్టి చూస్తే పన్ను చెల్లించగల సామర్థ్యం ఉన్న వాళ్లు 3% మందే. మొత్తం 120 కోట్ల మంది జనాభాలో 3శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించగల సామర్థ్యం కలిగి ఉన్నారనడం హాస్యాస్పదం.

4. మళ్లీ అందులో రిటర్నులు ఫైల్ చేసిన వారెందరో
మొత్తం పన్ను చెల్లించిన 2.01 కోట్ల మందిలో 9690 కోట్ల మంది రూ.1 కోటికి పైగా ఆదాయపు పన్ను కట్టారు. కేవలం ఒకే వ్యక్తి మాత్రం పన్ను రూపంలో రూ.100కోట్ల కన్నా ఎక్కువ(రూ.238 కోట్లు) చెల్లించి ఉండటం గమనార్హం. మొత్తం ఆదాయపు పన్ను రూపంలో వివిధ వ్యక్తుల నుంచి రూ.19,931 కోట్ల వసూళ్లు జరగ్గా దానికి సంబంధించిన విశ్లేషణ ఈ విధంగా ఉంది. రూ.5.5 లక్షల నుంచి రూ. 9.5 లక్షల మధ్య ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 2.80 కోట్లుగా ఉంది.

5. వివిధ మొత్తాల్లో పన్ను చెల్లించిన వారు
సగటున రూ.24,000 చొప్పున రూ.1.50 లక్ష కంటే ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 1.84 కోట్లుగా ఉంది. 2015-16 సంవత్సరంలో 4.07 కోట్ల మంది రిటర్నులు సమర్పించగా, 82 లక్షల మంది తమకు పన్ను సంక్రమించగల ఆదాయం ఏమీ లేదని చూపించారు. అంటే వారి పన్ను సంక్రమణ ఆదాయం ఏమీ లేకుండా రూ.2.5 లక్షల లోపే మొత్తం ఆదాయం ఉన్నట్లు లెక్క.

6. 2014-15 మదింపు సంవత్సరంలో ఇలా
ప్రస్తుతం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే ఎటువంటి ఆదాయపు పన్ను కట్టక్కర్లేదు. 2014-15 మదింపు సంవత్సరంలో 3.65 కోట్ల మంది రిటర్నులు ఫైల్ చేయగా 1.37 కోట్ల మంది పన్ను చెల్లించే ఆదాయం లేదని స్పష్టం చేశారు. అయితే ఒక్క విషయంలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అంతకు ముందు ఏడాది రూ.18.41 ట్రిలియన్లతో పోలిస్తే 2015-16లో వివిధ వ్యక్తులు చెల్లించిన మొత్తం ఆదాయపు పన్ను వసూళ్ల సంఖ్య రూ. 21.27 ట్రిలియన్లకు పెరిగింది.

7. మొత్తం ఆదాయ డిక్లరేషన్ ఇలా
రిపోర్టు చేసిన సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లింపుదార్లకు సంబంధించి అందరూ కలిసి తమ ఆదాయం మొత్తం రూ.33 లక్షల కోట్లు ఉన్నట్లు చెప్పారు. రూ. 2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారిగా 1.33 కోట్ల మంది ఐటీ శాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. అదే 2014-15 కాలంలో మొత్తం 3.91 కోట్ల మంది రిటర్నులు సమర్పించగా రూ.26.93 కోట్ల మేర పన్ను చెల్లించారు. అదే కంపెనీల విషయానికి వస్తే 7.19 లక్షల కంపెనీలు స్థూల ఆదాయాన్ని రూ.10.71 లక్షల కోట్లు చూపాయి. కార్లు మాత్రం కొంటారంట... పన్నులు మాత్రం కొంటారంట


Click it and Unblock the Notifications